Friday, July 8, 2022

నాలో నేను


నాలో నేను 


చిరాకులు చికాకు తెప్పిస్తుంటే

గొంతు నుండి బయటికి రాని బాధ భయపెడ్తుంటే

కనికరం  అనేది లేని కష్టం కలవరపెడుతుంటే

ఏకాంతం  నిశ్శబ్దంగా   వెక్కిరిస్తుంటే

ఎక్కడికి అని జీవన గమనం  ఆగకుండా ప్రశ్నిస్తూవుంటే

నాలో వున్న నేను ,నేనున్నాను అంటూ  నేస్తమై  నిలుస్తుంది

నా  గుండెలో నవ్వు   ఎప్పుడు  నీకు  నేను తోడు అని కొండంత   ధైర్యాన్నిస్తుంది 

నేను 'నేను' గా  నిలవడానికి   నా 'నేను' నాకు కొండంత   భరోసా 

నా జీవితం నా దోసిళ్ళలోనే ఉందని  సత్యం ఎప్పుడూ ధ్వనిస్తునే ఉంటుంది