వ్రాసే ప్రతి అక్షరము నీ కోసం
వేసే ప్రతి అడుగు నీ వైపు
చూసే కనులు నీకోసం
ప్రతి పలుకు నీకోసం
ఈ అన్వేషణ తండ్రి అరుణాచలా రమణా నీకోసం
నీ మౌనం వీడి నాకోసం పలుకుతావని ఆశ
నాలో నిన్ను చూసుకోమంటావు
నేను ఎవరో వెతుక్కోమంటావే
కానీ నా తండ్రి నా గమ్యం మే నీవు ఐతే
నాతో నాకు ఏమి పని
వున్నది అంత నీవు అయితే నేను అనే ప్రశ్నే లేదు