Sunday, November 17, 2019

మనం మరచిన మన తెలుగు తొలి వాగ్గేయకారుడు కృష్ణమయ్య- 3


ఒక భక్తుని శాపం మరొక  భక్తుని పిలుపు - అప్పన్న స్వామి శక్తి 


మనం మరచిన కృష్ణయ్య బ్లాగ్ లో భగవంతుడు భక్తుడికి శాపం, భక్తుడు భగవంతుడికి ప్రతి శాపం ఇచ్చిన గాధని  తెలుసుకున్నాము కదా. తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదని స్వామి నిరూపించారు స్వామి.కొన్ని వందల సంవత్సరాల తరువాత భక్తుడి కృష్ణయ్య మాట ను నిజం చేశారు స్వామి.దాన్ని గురుంచి ఇక్కడ తెలుసుకుందాము.
తనకే శాపమిచ్చిన కృష్ణమయ్య కు స్వామి ఏ వచన సంకీర్తన తో ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించావో అవే వచనసంకీర్తనలు భవిష్యత్ తరాలకు అందకుండా నీ ఖ్యాతీ మరుగున పడిపోవును అని శాపమిచ్చి అంతర్థానమవుతారు వరాహస్వామి.ఆ క్షణం లో తెలుగు లో తొలి లిఖిత అక్షరాలు రాగి రేఖుల పై లిఖించిన కృష్ణమయ్య కు తన గర్వం పూర్తిగా తొలగిపోయింది. వెంటనే  కృష్ణమాచార్యులు వారు రామానుజులు  వద్దకు వెళ్ళి శరణు వేడారు.భగవంతుడు భక్తుని కి దాసుడేనని ఆయన భక్తునిగా నీవు నోరు జారిన మాటకు తిరుగుండదని ఆలయ అగ్నికి ఆహుతి అవుతుందని అదే సమయాన తన శక్తిని స్వామి నిరూపించుకుంటారని శెలవిచ్చి వెళ్ళారు రామానుజులవారు.
తన తప్పుకు ప్రాధేయపడి పడి అంతరాలయన దుఃఖిస్తున్న కృష్ణమయ్య వద్దకు వచ్చిన స్వామి నీ వచన సంకీర్తన వ్యర్థం కాదని కొంతకాలం తరువాత తిరీగీ వెలుగోలోనికి వస్తాయని అభమిచ్చారు అప్పన్న స్వామి
. తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదని స్వామి నిరూపించడానికే తన ఆలయం మీద దండయాత్ర జరిగిన సహించాడు స్వామి.
అదే సమయాన మరో భక్తుని మొర ఆలకించి ఆ దండయాత్రను తిప్పి కొట్టాడు వరాహనృసింహుడు.
ఈ సంఘటన జరిగినప్పుడు ఆలయం లో వుంది స్వామీ ని పిలిచిన  భక్తుడు ,కవి   గోగులపాటి కూర్మనాథ కవి.ఈ కవి గురించి మరియు ఆలయ లో  18 శతాబ్ద ప్రారంభంలో తురష్కర దండయాత్ర జరిగిన ఘటన గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది వున్నారని నా అభిప్రాయము.
కలియుగాన భగవంతుడిని మరో సారి రప్పించిన  ఈ మహాకవి గోగులపాటి కూర్మనాధుల వారు విజయనగర రామతీర్థ గ్రామంలో సుమారు 1720 ప్రాంతంలో జన్మించారు. విద్యాభ్యాసము తరువాత, విజయనగర సంస్థానము యొక్క దేవస్థానాలలో ఉద్యోగిగా రామతీర్థంపద్మనాభంసింహాచలంశ్రీకూర్మం లలో పనిచేశారు. 'వైరి హర రంహ సింహాద్రి నారసింహ ! 'అనే మకుటంతో "సింహధ్రి నారసింహా శతకం" అని 101 పద్యాలు రచించిన పరమ భక్తుడు ఈయన.
18వ శతాబ్ద ప్రారంభంలో తురష్కర దండయాత్ర జరిగిన సమయాన సింహచల ఆలయంలోనే ఉన్నారు కూర్మనాథ కవివర్యులు. తురష్కరులు దక్షిణ దేశ దండయాత్ర లో సింహచల క్షేత్రం పై దండెత్తారు ఆలయాన్ని నిర్బందించారు ఆ సమయాన సింహచల క్షేత్రం లో వారం రోజులు ఆలయం మూతబడింది . తన భక్తుడు కృష్ణమయ్య శాప ఫలితంగా అలా వారం రోజులు అగ్నికి ఆహుతి అవుతందనే మాట అగ్నిహోత్రాలు లేకుండా నిలిచేలా చేసి తన భక్తుని వాక్కు మహత్తును నిజం చేశాడు వరాహానరసింహుడు. వారం రోజుల అలుపెరగని దండయాత్రలో కడకు ఆలయంలోకి ప్రవేశించారు తురష్కరమూక.ఆలయాన్ని నేల మట్టం చేసి నిధులు దోచుకు పోడానికి మహత్తర పన్నాగం పన్నారు.
కళ్యాణమండపం  పై విరుచుకుపడ్డారు, ఆలయంలోని బేడా మండపం రాతిరథం గర్భాలయం పై ఉన్న విగ్రహలు ధ్వంసం చేసే ప్రయత్నంలో కాస్త సఫలమయ్యారనే చెప్పాలి . నాటీ సాక్ష్యాలే నేటికి  ఆలయంలో అక్కడక్కడ శిధిలమైన విగ్రహాలు  మనకి కనిపిస్తాయి.ఆ సమయం లో కూర్మనాధ కవి గారు ఆలయం లోనే వున్నారు.వైరి సంహార అని స్వామి ని ఎలుగెత్తి ఆర్తి తో పిలిచారు స్వామి ని.కూర్మనాధుల వారి మనస్సు దహించుకుపోయింది. వైరి సంహరి నేను అయితే ఒక్కడినే తండ్రి ఏలాగోలా తప్పించుకు పోతా మరి నీ విషయం అలా కాదే 16000 మంది గోపికలు వున్నారు వారి అందరితో ఎలా పారిపోతావు రావయ్యా రా వీరి సంగతి చూడవయ్య అని  ఆర్తి తో పిలిచాడు అప్పన స్వామి ని.భక్తుడు ఆర్తి తో పిలవటం అప్పన స్వామి  రాక పోవటం జరుగుతుందా.పిలవగానే టక్కున వచ్చాడు.అది మామూలుగా కూడా కాదు. తుమ్మదెల గుంపై  నిండైన  చందన విగ్రహం నుండి వచ్చాడు. తురష్కరులను చీల్చి చెండాడటానికి గుమ్మడికాయంత ఆకారన తుమ్మెదల రూపం లో వచ్చాడు. తురష్కరులు అనుకున్నది సాదించకుండానే వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. తురష్కరలను తరిమికొట్టడానికి తుమ్మెదల గుంపు కొండ దిగుతుంటే కారుమబ్బులు సింహాచల గ్రామాన్ని చుట్టుముట్టాయా అన్నంత భయంకరంగా కనిపించాయట .అలా ఆ తుమ్మెదల గుంపు  తురష్కరులను "తుమ్మెదల మెట్ట" వరకు తరిమి కొట్టాయని చరిత్ర చెబుతుంది.ఆ తుమ్మెదల మెట్ట నే ఇప్పటి చావులమదుం . అలా తన భక్తుని శాపంలో భక్తుని మాటను ఇటు తన మహత్తుని నిరూపించుకొని తురష్కర దండయాత్రను తుమ్మెదల రూపంలో తిప్పి కొట్టి కూర్మనాథ కవి వాక్కుని నిజం చేసిన దాసానుదాసుడు సింహచల వరాహలక్ష్మీనృసింహుడు అదే మన సింహాద్రిఅప్పన్న. చావులమదుం(తుమ్మెదల మెట్ట) దగ్గర ఆ తుమ్మెదలు ఒక బిలంలో దూరాయని అదే బిలంలో కృష్ణమయ్య సంకీర్తనలు ఉన్నాయని ఒక ప్రచారం కూడా వుంది. చూద్దాం స్వామి సంకల్ప బలం ఎలా ఉందో.మన కృష్ణయ్య సంకేర్తనలు అన్నీ వెలుగులోకి ఎప్పుడు  తీసుకు వస్తాడో ఆ భక్త సులభుడు అప్పన్నే స్వామికే  వదిలివేద్దాము. 

ఆ సింహాద్రి అప్పన్న అనుగ్రహం  వాళ్ళిద్దరి మీదే కాకుండా మనమీద కూడ ప్రసరించాలని  కోరుతు  సెలవుతీసుకుంటున్నాను . తరువాతి  బ్లాగ్ లో మరియొక ఆసక్తి దాయకమైన విషయం తో కలుద్దాము. 

ఓం శ్రీ భగవాన్ రమణాయ  నమః  


Tuesday, November 12, 2019

మనం మరచిన మన తెలుగు తొలి వాగ్గేయకారుడు కృష్ణమయ్య-2


తెలుగు  తొలి  వాగ్గేయకారుడు శ్రీకాంత కృష్ణమాచార్యులు 

ఆఖరి  భాగం 






కృష్ణమయ్య సంకీర్తన యఙ్ఞం జరుగుతుండగానే సింహాచల క్షేత్రానికి ఆదిశేషు అవతారం అయిన భగవద్రామానుజులు వారు విచ్చేసి , ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటు న్నారు.ఇప్పుడు కొంచెం రామానుజాచార్యుల సింహచాల క్షేత్ర దర్శన  సంగతులు చెప్పుకుందాము.రామానుజాచార్యుల వారు తప్పస్సు తో పాటు  రోజు నేటీ ఆలయ బేడా మండపంలో ఈశాన్య మూల ప్రవచనాలు చెపుతువుండేవారు. ప్రవచనాలు వినడానికి స్వామి వారు హంస రూపంలో ప్రతిరోజు  వస్తువుండెవారట. సింహగిరి క్షేత్రానికీ ప్రతిరోజు వస్తూ ఈశాన్య మూల కూర్చోని రామానుజులవారి వచనాలు వినడంతో ఆ స్థలం "హంసమూల" గా ప్రసిద్ది చెందింది . ఇప్పుడు కూడా ఈ చోటు ని  ఆలయ ఈశాన్య భాగాన రాతిరథం వెనుక వైపు ఈ హంసమూల అచట శ్వేత వర్ణంలో భగవద్రామానుజుల వారిని వారితో పాటు శ్రీ సింహాచల దేవస్థానం ఏర్పాటు చేసిన రాతిశాసనాన్ని చూడవచ్చు.చూసారా  మన సింహాద్రి అప్పన్న ఎంత  భక్త సులభుడో ,ఒకరి కోసం హంస రూపం లో  ఇంకొకరికోసం బాలుని రూపం లో దర్శనం ఇచ్చారు .
ఇప్పుడు మన కధ లోకి వద్దాము.   తన సంగీతానికి ,తన సంకీర్తనకు అప్పన్న దాసుడు అని భావించిన కృష్ణమయ్యకు గర్వం పెరిగింది అందుకని ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటున్న రామానుజాచార్యుల వారిని  కృష్ణమాచార్యులు అంతగా లక్ష్య పెట్టలేదు కనీసం నమస్కారం కూడా చేయలేదు .గర్వం  అనేది అద్యతిమిక  పురోగతికి  ఆటంకం అందుకని రామానుజులు, తన సహజ కృపా దృష్టితో ఈ పనికి పూనుకున్నారు. వారు కృష్ణమా చార్యునితో, తాము నృసింహుని సన్నిధికి వచ్చామని, కృష్ణమాచార్యులు భగవంతునికి బహు సన్నిహితులు గనుక, తనకు ముక్తి లభిస్తుందో లేదో స్వామిని విచారించి తనకు తెలియజేయమని కోరారు. అలా ఆ సందేహన్ని యథావిధిగా బాలుని రూపంలో రాత్రి తన సంకీర్తనకు నర్తించి స్వామి వెళ్తుండగా అడుగుతాడు కృష్ణమయ్య.
ఆ మాటకు స్వామి అందరకీ మోక్షన్నిచ్చేది రామానుజుడైతే ఆయనకీ నేను మోక్షమివ్వడమేంటనీ అడుగుతాడు. ఆ మాటకు ఖిన్నుడైన కృష్ణమయ్య తానిన్నాళ్లూ ఎవరినైతే లక్ష్య పెట్టలేదో అతడే అందరికీ ముక్తినిచ్చేవాడని ఈ స్వామి చెప్పటమా? ఏమిటీ దేవుని న్యాయరీతి? ఒక పక్క గుండెలు రగులు తూంటే స్వామినడిగాడు,పోనీ, నా జీవిత మంతా నీ కైంకర్యానికే వినియోగించాను కదా! మరి నాకైనా నీవు ముక్తినిస్తావా? అని.అప్పుడు స్వామి వారు  నీకు కూడ మోక్షమిచ్చేదీ రామానుజుల వారేనని చెపుతాడు. ఆది నుండి రామానుజుల పట్ల చిన్నచూపు చూసిన కృష్ణమయ్యకు ఈ మాట అనిశపాతంలా తగిలింది.దుఖం తో కూడిన కోపం తన్నుకువచ్చింది.తన జీవితమంతా ఎవరి సేవ కొరకు వినియోగించాడో, ఆ సింహాచల నాథుడనవలసిన మాటేనా ఇది అని కోపం తో  భగవంతుడు,తను ఆరదించిన దేవదేవుడు అని మర్చిపోయి దూషించటం  మొదలుపెట్టాడు.స్వామి వారు కూడా ఎక్కడ తగ్గ కుండ “ ముక్తియంతటి స్థితి నీకివ్వటానికి, నేనేమీ నీకు ఋణపడిలేను. నీవు నీ గానం తో నన్ను పరవశింపజేస్తే, నేను నాట్యంతో నీకు పరమానందం కలిగించాను. కాబట్టి బాకీ చెల్లి పోయింది. అయినా అకారణంగా దైవ దూషణ చేశావు గనుక, ఏ పద వాఙ్మయం చూసుకుని నీవింతగా గర్విస్తున్నావో, అది భావితరాలకు అందకుండా పోతుంది” అని శపించారు. ఈ అఘాతానికి ఆచార్యుల మతి స్థిమితం కూడా పోయింది. ముక్తి సంగతి అలా ఉంచితే, శాపమా తనకు దక్కేది అని ఆచార్యుల వారు కోపం లో స్వామి వారికి  “ నీ ఆలయం ఏడు రోజులపాటు అగ్నికి ఆహుతి అవుతుంది” అని ప్రతి శాపమిచ్చారు. భక్తుడు భగవంతుడికి, భగవంతుడు  తన భక్తుడికి  శాపాలు ఇచ్చుకునే ఇటువంటి ఘటన  ఇంకెక్కడా కనిపించదేమో.
4లక్షల 32 వేల సంకీర్తనలు తెలుగు లో తొలి లిఖిత అక్షరాలు రాగి రేఖుల పై లిఖించిన కృష్ణమయ్య కు తన గర్వం పూర్తిగా తొలగిపోయింది.మనో నేత్రంలో మహావిష్ణు రూపంలో రామానుజులు వారు కనపడే సరికి వెళ్ళి శరణు వేడారు కృష్ణమాచార్యులు వారు.భగవంతుడు భక్తుని కి దాసుడేనని ఆయన భక్తునిగా నీవు నోరు జారిన మాటకు తిరుగుండదని ఆలయ అగ్నికి ఆహుతి అవుతుందని (ఇక్కడ ఆహుతి అనే పదానికి ధ్వంసం అనే అర్థం తీసుకోవాలి) అదే సమయాన తన శక్తిని స్వామి నిరూపించుకుంటారని శెలవిచ్చి వెళ్ళారు రామానుజులవారు. కొన్ని వందల సంవత్సరాల తరువాత కృష్ణమయ్య మాటలు నిజమయ్యాయి. ఈ శాపాల ప్రభావమా అన్నట్లు, 18వ శతాబ్దంలో జరిగిన విదేశీ దండయాత్రల్లో ఈ క్షేత్రం విధ్వంసానికి గురికాగా, ఆచార్యుల సంకీర్తన వాఙ్మయం అంతరించి, నేడు కేవలం రెండు వందల సంకీర్తనలు మాత్రమే లభ్యమౌతున్నాయి. తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదని స్వామి నిరూపించడానికే తన ఆలయం మీద దండయాత్ర జరిగిన సహించాడు స్వామి.అదే సమయాన మరో భక్తుని మొర ఆలకించి ఆ దండయాత్రను తిప్పి కొట్టాడు వరాహనృసింహుడు(ఈ గాధ తరువాతి బ్లాగ్ లో చెప్పుకుందాము).
మన కృష్ణయ్య కాకతీయ సామ్రాజ్య ప్రభువు ప్రతాపరుద్రుడు సమకాలనీకుడు. భక్తి పారవశ్యం తో కీర్తనలు చేస్తున్న విషయము అప్పటి కాకతీయ  ప్రభువు  ప్రతాపరుద్రుడు కి తెలిసి కృష్ణమయ్య ను ఓరుగల్లు(ఇప్పటి వరంగల్) కి పిలిపించి  కనిగిరి లో  నాలుగవ  బాగాన్ని మరియు  50 గ్రామాల పై అధికారాన్ని ధారదత్తం చేశారు.ఆచార్యులు వారు రచనా  వ్యాసంగం ,సంకీర్తన  తో పాటు నిరుపేదలకు ధన సాయమ ,ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేవారు.ఆయన తన చేపట్టిన రచనలన్నీ రాగి రేకుల పై చెక్కించి శాశ్వతత్వాని కల్పించారు.ఈ పద్దతినే  అన్నమయ్య కూడా అనుసరించారు.కొంతమంది అసూయపరులు,దుష్టులు ఆచార్యుల వారు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని  ప్రతాపరుద్ర చక్రవర్తి కి పలుమార్లు  ఫిర్యాదు చేసిన కృష్ణమయ్య మనసతత్వం తెలిసిన  ప్రతాపరుద్రుడు ఫిర్యాదు చేసిన వారిని మందలించారు.ఈ సంగతి తెలిసిన ఆచార్యుల వారు   సింహాచల వరాహ నరసింహ స్వామి ని స్తుతించి చేసిన సంకీర్తన వలన ఓరుగల్లు నగరం లో  కనక వర్షం కురిసిందని చారిత్రిక ఆధారం సిద్దేశ్వర చరిత్ర అనే గ్రంధం ద్వారా తెలుస్తుంది.
పరిపూర్ణ భక్తి పరిమళంతో, మన అంతరంగమంతా నిండి పులకింపజేస్తాయి. ఆర్తి, శరణాగతితో నిండి లయ బద్ధంగా, రాగయుక్తంగా ఉండటం వల్ల, వచన గేయాలుగా ప్రసిద్ధికెకృష్ణమాచార్యుల వచనాలుక్కాయి. ప్రతి వచనమూ “దేవా“ అనే సంబోధనతో మొదలై, “సింహగిరి వరహరీ! నమో నమో దయానిధీ అన్న మకుటంతో ముగుస్తుంది.వీటిలో వ్యక్తమయ్యే దృఢభావాలు ।సింహగిరి నృసింహుని మించిన దైవం లేదు శ్రీ వైకుంఠం కంటే మరో ప్రయోజనం లేదు| అని. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని తెలుగు వేదాలుఅనీ అన్నారు.అన్నమయ్య మరియు పోతన గారికి  కృష్ణమాచార్యులవారే  ప్రేరణ ,స్పూర్తి మన క్రిష్ణమయ్య గారి వచనాలే.
కృష్ణమయ్య రచన, సంగీతం, నాట్యం, భక్తి గల బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నిటికి మించి అభ్యుదయవాది.ఆయన రచనలను పరిశీలిస్తే ఆయన  వైష్ణవ సంప్రదయాన్ని త్రికరణ శుద్దిగా ఆచరించి చూపిన మహానుభావుడు.శ్రీమద్వరామానుజాచార్యులు సూత్రాలైన ఆచార్య భక్తి,స్వామి కైంకర్యం,వర్ణాశ్రమధర్మ రాహిత్యం మొదలిన వైష్ణవ ధర్మాలను  తన రచనలలోనే కాదు తన జీవన విదానంలో  కూడా ఆచరించారు.తన చిన్ననాడు తనని కాపాడిన కువ్వారు స్వామి ని  జీవితాంతం స్మరిస్తూనే వున్నారు.
సింహాచలం మరియు ఇతర కొన్ని వైష్ణవ ఆలయాలలో  నేటికీ కొన్ని ఉత్సవ సమయాలలో “సన్నిధి విన్నపం” ఆనే సంప్రదాయం వుంది.ఆ సంకీర్తన కృష్ణమయ్యదేనని కొందరి భావన. మన దురదృష్టం కొద్ది  ఆయన రచనలలో 150/200 తంజావూరు గ్రంధాలయం లో తాళ పత్రాలలో దొరికాయి.వైష్ణవం పేరుతో  జరిగే కొన్ని  ఛాందస్త భావాలని కృష్ణమయ్య తీవ్రముగా ఖండిచటం వలన  ఆయన్ని ఆ రోజులో వెలుగు లోకి రాకుండా చేశారని కూడా బావించవచ్చు.నాలుగు లక్షలుకు పైగా సంకీర్తనలు చేసిన  ఆ మహానుభావుడు మరియు ఆ కీర్తనలు  వెలుగులోకి రాకపోవటం మనం చేసుకున్న దురదృష్టం. ఆయన తరువాత తరం వారైన అన్నమయ్య కు  తగినంత ప్రాచుర్యం లభించిఆయన కీర్తనలు వెలుగు లోకి రావటం   ఈయన వెలుగులోకి రాకపోవటానికి  అన్నమయ్య కు వున్నట్టు ఆచార్యుల వారికి  ప్రతిభావంతులైన కొడుకులు మరియు మనుమలు  లేకపోవటం  కూడా కావొచ్చు.అన్నమయ్య సంకీర్తనలు వెలుగు లోకి రావటానికి  టి‌టి‌డి చేసిన కృషి కూడా ఒక కారణం.కానీ మన కృష్ణమ్మయ్య కి ఎవరి అండదండలు అంటే  అటు ప్రభుత్వం కానీ  ఇటు దేవస్థానం సహకారం   లేకపోవటం వలన కూడ ఆయన కీర్తి,కీర్తనలు కూడ చీకటిలో మరుగున పడిపోయాయి.
ఆ కీర్తనలు శ్రీ కూర్మంలో గల పుష్కరణి మధ్యలో ఉన్న స్వామి ఆలయం క్రింద ఉన్న సొరంగం లో ఉన్నాయనీ.. కాదు చావులమదుం(తుమ్మెదల మెట్ట) దగ్గర ఆ తుమ్మెదలు ఒక బిలంలో దూరాయని అదే బిలంలో ఈ సంకీర్తనలు ఉన్నాయని వివిధ ప్రచారలు ఉన్నాయి. అలానే బ్రిటీషర్లు తరలించుకుపోయిన మన సంపదలో120 రాగిరేఖుల సంకీర్తనలు కూడా ఇంగ్లాండు మ్యూజియంలో ఉన్నాయి.
ఆ దేవదేవుడు సింహాద్రి అప్పన్న నే పూనికొని  తన భక్తుడి సంకీర్తనలన్నీ వెలుగు లోకి ఆ దేవదేవుడే తేవాలని  ప్రార్ధిస్తూ  ఉదాహరణ కి  కృష్ణమయ్య  వచనాలు  కొన్ని
దేవా!
విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తనము జేయునతడే కులజుండు .
శ్వపచుండైననేమి?ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటే నతడే కులజుండు.


దేవా!
జయా జయా  రాఘావేశ్వరా !శ్రీ మన్నారాయణా
పరబ్రహ్మ స్వరూపా !అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకా
 వేదాంత వేద్య,పురాణ పురోషోత్తమా!
పురంధరవంద్య,కపటనాటక సూత్రధారి
ఆగణిత మహిమావతార !సకలగుణోన్నత!
శ్రీ కృష్ణ కువ్వారు స్వామీ!
సింహగిరి నరహరి! నమో నమో దయానిధి.

దేవా!
ఇదియే సత్యము ఇదియే నిత్యము
హరి నామమే పరమపదసోపానము
మనసా నీవు అనుమానముడిగి
నరహరి నామము తలచిన చాలు  ||ఇదియే సత్యము||
ఇదియే నాకు జపము తపము
ఇదియే నాకును పరమమంత్రము
ఇదియే నాకును పరమధర్మము
వేదశాస్త్ర పఠనింబిదయే !
సింహగిరి నరహరి! నమో నమో దయానిధి  ||ఇదియే సత్యము||

నేటి అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే విధంగా రాశాడు. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన కృష్ణమాచార్యులు మనకు ఆరాధ్యుడు మరియు చిరస్మరణీయుడు.ఆయన కీర్తి మరియు ఆచార్యుల వారి నాలుగు లక్షల ముప్పైరెండువేల  సంకీర్తనలు వెలుగు లోకి రావాలని  ఆ సింహాద్రి అప్పన్న ని కోరుకుందాము.

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః

Monday, November 11, 2019

మనం మరచిన మన తెలుగు తొలి వాగ్గేయకారుడు కృష్ణమయ్య



తెలుగు  తొలి  వాగ్గేయకారుడు శ్రీకాంత కృష్ణమాచార్యులు 

మొదటి భాగం 

అప్పన్న స్వామి నిజ రూపం 
ఉత్తరాంధ్ర అనగానే మనకు  మొదట గుర్తుకు వచ్చేది సింహగిరి నాధుడు  సింహాద్రిఅప్పన్న మరియు ఆయన కొలువు తీరిన సింహాచలం .కోరిన వారి కొంగుబంగారము మన అప్పన తండ్రి. ఆ అప్పన్న తండ్రి భక్తుడే  తెలుగు తొలి వాగ్గేయకారుడు  శ్రీకాంత కృష్ణమాచార్యులు.ఈయన కృష్ణమయ్య గా కూడా  ప్రసిద్ధి. తన గానంతో స్వామి ని పిలిచి తన సంకీర్తనతో స్వామిని మెప్పించి   స్వామి  ని నాట్యమడించిన  అసామాన్య  భక్తుడే ఈ కృష్ణమయ్య.అన్నమయ్య ఆ తురుమలేశుడు  మీద  సంకీర్తనలు  వ్రాసి పాడి మన తెలుగు వారి హృదయం లో చోటు  చేసుకుంటే   ఈ కృష్ణమయ్య  దేవా అని సంభోధనతో తన సంకీర్తనను మొదలుపెట్టి "సింహగిరి నరహారి నమో నమో ధయానిధి" మకుటంతో పూర్తి అయ్యే 4లక్షల 32వేల సంకీర్తనలు రచించి స్వామి కె అంకితం ఇచ్చిన సింహగిరి వరాహ నరైంహస్వామి  భక్తుడు  శ్రీ కాంత కృష్ణమాచార్యులు. కృష్ణమయ్య ఆళ్వారు శ్రేణికి చెందిన  తెలుగులో మొదటి పద కవితాచార్యుడు  మరియు అన్నమయ్య కంటే ముందు సంకీర్తనలు వ్రాసి పాడిన వాగ్గేయకారుడు.మన దురదృష్టం యేమిటంటే ఈయన పేరే చాలమందికి తెలియదు ఇంకా ఆయన సంకీర్తనలు కూడా చీకటి లోనే వుండిపోయాయాయి.ఈ గొప్ప భక్తుడి జీవిత చరిత్ర   అబ్బురమనిపించే కధనం.
శ్రీకాంత కృష్ణమాచార్యులు క్రీ.శ. 1295 నుండి క్రి.శ.1323 మధ్య కాలంలో ఓరుగల్లును రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికి చెందిన వాడు. ` ప్రతాప చరిత్ర 'సిద్దేశ్వర చరిత్ర'తిరగవేస్తే ఈయన జీవితం చరిత్ర కనిపిస్తుంది. ఈ గ్రంధం ఆధారంగా  కృష్ణమయ్య గురించి వెలుగు లోకి తెచ్చింది నిడదవోలు  వెంకట రావు గారు. కృష్ణమయ్య తన `జన్మ సంకీర్తన' లో  జన్మ విశేషాలు ఇలా చెప్పుకున్నారు ఆయన  `తారణ' నామ సంవత్సరం, భాద్రపద కృష్ణ చతుర్దశి, మంగళ వారం నాడు జ్యేష్టా నక్షత్రములో సంతూరు అనే గ్రామంలోజన్మించారని, ఆయన  పుట్టుకతో అంధుడు  అవ్వటం వలన  తల్లి తండ్రులు  ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు కృష్ణమాచార్యుల వారిని  కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో   చూపు వచ్చిందనీ,స్వామి ఆదేశం మేరకు నాలుగు లక్షలు పైగా సంకీర్తనలు వ్రాసి పాడి నట్టు చెప్పుకున్నారు. ఆకలి తో ఏడ్వడం చూసిన కృష్ణమయ్య వద్దకు సింహాధ్రి అప్పడే స్వయంగా పాలు తీసుకొని వెళ్ళి త్రాగించడంతో ఆ బిడ్డకు తిరిగి కళ్ళు వచ్చాయి.కృష్ణకవ్వారు స్వామిజీ రక్షించిన బిడ్డను తల్లితండ్రులు తిరిగి తీసుకొని కృష్ణమాచార్యునిగా నామకరణం చేసారని  కూడా కొందరు చెపుతారు.స్వామి దయతో తన కు అంధత్వం పోవడంతో తన జీవితాన్ని స్వామి కే అంకితమిచ్చారు కృష్ణమయ్య.జన్మస్థలం మహబూబనగర్ జిల్లా లో  సంతూరు అని కొందరు అంటే సింహాచలం దగ్గరిలో ఈలాంటి పేరు తో  వున్న గ్రామాలు వున్నాయి కాబట్టి కృష్ణమయ్య సింహాచలం  దగ్గర ఉన్న సంతూరు లో జన్మించారని  ఆరుద్ర మరికొందరు బావిస్తున్నారు.
కృష్ణమాచార్యునికి మేనమామ కూతురితో వివాహం జరిగింది. వీరి ఏకైక కుమారుడు తన ఏడవ యేటనే మరణించటంతో, ఆ ఆవేదననధిగమించే ప్రయత్నంలో తన సంకీర్తనలో మరింతగా మునిగిపోయాడు. కృష్ణమయ్య సంకీర్తనం చేస్తూ ఉంటే నరసింహస్వామి బాలుని రూపంలో వచ్చి నాట్యం చేసేవారని ప్రతీతి. కృష్ణమయ్య వయసు వచ్చాక తన మహిమలతో ప్రజలని దిగ్భ్రాంతుల్ని చేసి`పదకొండవ అవతారుని'గా భావించేవారట .కామి కానీ వాడు మోక్షగామి కాదు అనేది లోకోక్తి.మన కృష్ణమాచార్యుని విషయం లో కూడా ఈ ఘటన జరిగింది.   పరిపూర్ణ యవ్వనంతో ,మంచి వర్చస్సు తో  నున్న ఆచార్యులవారు స్వామి ఎదుట చిరుతాళాలు మోయిస్తూ, దండెం మీటుతూ, సింహాద్రినాథుని కీర్తిస్తున్న దృశ్యం చూసి,మోహిని  అనే దేవదాసి ఆయనపై మనసు పడింది.ఆమె అసమాన సౌందర్యం, హావభావాల చొరవ, కపటం లేని సాహచర్య కాంక్షతో, ఆచార్యుల వారి హృదయాన్ని ఆకట్టుకున్నదా మోహనాంగి.కానీ ఆమెతో ఎంత వున్న వరాహ స్వామి ఆరాధన  సంకీర్తన మాత్రము  ఎల్లపుడూ సాగుతువుండేవి.ఒకసారి యేమి జరిగినది అంటే ఆచార్యుల వారి భక్తి ,సంకీర్తన ల మహిమ శ్రీ రంగం లో వున్న ఇద్దరు విష్ణు భక్తులు విని ఆచార్యుల వారి దర్శనం కోసం శ్రీరంగం నుండి సింహాచలం వచ్చారట.ఇక్కడ మన అప్పన్న స్వామి లీల చూడండి.ఆ ఇద్దరు భక్తులు ఆచార్యుల వారిని వెతుకుంటూ దేవదాసీ ఇంటి దగ్గరకి వచ్చి కృష్ణమాచార్యుని నే వారినే  ఆ వరాహ స్వామి భక్తగ్రగణ్యుడు అయిన కృష్ణమయ్య ఎక్కడ వుంటారు అండి.సాక్షాత్తు  ఆ వరహస్వామి నే తన సంకేర్తన తో ఓలలాడించి ,స్వామినే స్వయంగా నాట్యం ఆడేటట్టు చేసుకున్న ఆ భాగవోత్తముడు అయిన ఆచార్యుల వారిని చూసి మా జన్మ తరింపచేసుకుందామని శ్రీరంగం నుండి ఇక్కడికి ఈ సింహాచలం వచ్చామయ్యా అని విన్నవించుకున్నారట.అప్పుడు ఆచార్యుల వారికి నేనే ఆ క్రిష్ణమయ్య ని చెప్పుకోవటానికి చాలా సిగ్గుగా అనిపించింది ఆట.అయ్యో నేను ఎలాంటి నీచమైన  స్తితిలో ఇక్కడ దేవదాసీ ఇంటి దగ్గర వున్నాను. వీరు నన్ను ఇలా చూస్తే ఏమనుకుంటారు అని మధనపడి వారికి ఆచార్యుల వారే వారు వెళ్లాలిసిన  చిరునామా  త్రోవ చెప్పి ఆచార్యుల  వారు పరుగు పరుగున  అడ్డదారి లో వారికంటే ముందే అక్కడికి  చేరుకొని శిరోముండనం చేసుకొని  తనని  గుర్తుపట్టకుండా తలకి  బట్ట కప్పుకొని వారిని కలిసారట.ఆ క్షణం నుండి అన్నీ సాంగత్యలు వీడి పూర్తిగా అప్పన్న ద్యాస మరియు ద్యానం లో మునిగిపోయారు ఆచార్యుల వారు.ఒకోసారి మనలాంటి వారికి ఇంతటి మహాభక్తునికీ  ఈ వికారా లేమిటి అనిపించవచ్చు.కానీ అంతా విష్ణు మాయ కదండీ . ఎవరి కర్మ శేషం వాళ్ళు అనుభవించాలి మరి.కర్మ ఫలం అనుభవించేటప్పుడు భగవంతుడు సాక్షిబూతుడు గానే వుంటాడు మరి ఎందులోనూ కల్పించుకోడు. సమయం వచ్చినప్పుడు మాత్రము ఏదో ఒక ఘటన  ద్వారా జీవితాన్ని మలుపు తిప్పి తన భక్తులను సరియయిన త్రోవలోకి  తీసుకు వస్తారు.ఎంతైనా స్వామి భక్త సులభుడు కదా.

11వ శతాబ్దం లో సంకీర్తనలు పాడుతున్న కృష్ణమయ్య వద్దకు బాలుడుగా వచ్చి ఆడిపాడి ఆనందింప జేశాడు మన అప్పన్న స్వామి.తొలి తెలుగు అక్షరాన్ని కృష్ణమయ్య సంకీర్తన  వింటూ ఆయన తొడ మీద కూర్చొనీ రాగి రేకు మీద లిఖించింది సింహాచల వరాహానరసింహుడే.ఆయన ఆ విధంగా రచించి ఇవ్వడం చూసిన కృష్ణమయ్య ఆనాటి నుండే 432000 సంకీర్తనలు రాగి రేకుల పై లిఖించి స్వామికి అంకితమిచ్చారు.ద్రవిడాంధ్ర అక్షరాలను వచన సంకీర్తనంగా తొలి సారి లిఖించింది "సింహాధ్రి అప్పన్న స్వామి".కానీ మన దురదృష్టం ఒక 200 పాటలు మాత్రమే లబ్యమవుతున్నాయి.ఇలా ఎందుకు జరిగింది అంటే ఒక అద్భుతమైన గాధ బాగా ప్రాచుర్యం లో వుంది. ఆ కధ ఇంకా మరికొన్ని విశేషాలు  నా తరువాతి బ్లాగ్ లో  పొందుపరుస్తాను.

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 

Friday, November 8, 2019

చిన్న తిరుపతి -ద్వారకా తిరుమల -ఏలూరు


                              చిన్న తిరుపతి -ద్వారకా  తిరుమల -ద్వి ధ్రువమూర్తులు 





హిందువులు  అందరికీ  ఆంధ్రప్రదేశ్ అంటే  ముందు గుర్తుకు వచ్చేది కలియుగ  వైకుంఠమ్ తిరుమల తిరుపతి . మన తెలుగు వారు చేసుకున్న  పుణ్యం ఏమిటంటే   స్వామి వారు ఒక తిరుపతి  లోనే కాదు మనల్ని తరింపచేయటానికి   స్వయంభూ గా వెలసిన క్షేత్రం ఇంకొకటి  మన ఆంద్రప్రదేశ్ నేల పైనే  వుంది . ఆ క్షేత్రమే  చిన్న తిరుపతి గా పిలవబడే ద్వారకాతిరుమల .ఈ ద్వారకతిరుమల క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరు కి 42 కి మీ  దూరం మరియి భీమడోలు కి 17 కి మీ దూరం లో వుంది .ఇట్టి మహిమాన్విత క్షేత్రం గురించి  నాకు తెలిసిన  మరియు నేను చూసిన  కొన్ని విషయాలు ఇక్కడ మీతో పంచుకుంటాను .
|| శ్రీ  మద్వ్యాళగిరావహింద్రానిలయాన్యస్తాంఘ్రి కంజద్వయంశ్రీ  మద్ద్వారకమౌని పూజిత పదం  శ్రీ భూమినీళాన్వితంగోవిందం,నతచేతనాఘహరణం,త్రైవిద్య తాపాపహంవన్డే భక్తవరప్రదం స్మితముఖం శ్రీ    వేంకటేశం విభుం ||
శేషకృతి గల పర్వతమందలి,పూట్టలో పాదములు గలవాడు,శ్రీ ద్వారక మహర్షి చే పూజింపబడిన పాదపద్మములు కలవాడు ,శ్రీ భూ నీళాదేవులతో కూడి వున్నవాడు,గోవిందుడు,ఆశ్రితుల పాపములను హరించువాడు,త్రివిధ  తాపములను పోగొట్టువాడు ,భక్తులకు వరములు ఇచ్చినవాడు ,సదా  చిరునవ్వు   లొలుకు ముఖము గలవాడు సర్వవ్యాపకుడు అగునట్టి ద్వారకతిరుమల వేంకటేశ్వరస్వామి వారిని గూర్చి నమస్కరించుచున్నాను.
(ఈ శ్లోకం వ్రాయటానికి ఒక చిన్న విషయం జరిగింది  ,మీతో పంచుకోవాలనుకుంటున్నాను . నేను ద్వారక తిరుమల బ్లాగ్ వ్రాయటం మొదలుపెట్టిన తరువాత  నేను బయటకి వెళ్ళటం జరిగింది .నేను  నడుచుకొని వస్తువుంటే రోడ్ మీద ఈ శ్లోకం మరియు తాత్పర్యం వున్న ఒక కాగితము  దొరికింది .చాలా సంతోషముగా అనిపించి ఇక్కడ  ఈ శ్లోకం ని  జోడించాను.)


ద్వారకా తిరుమల ఉభయ గోదావరి మరియు కృష్ణ జిల్లా లో ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వర క్షేత్రము. స్వయంభువుగా వెలిసిన  స్వామి ని చీమల పుట్టల  నుండి తీసి  ద్వారక అనే మునిపేరు  మీద ద్వారక తిరుమల అని  పిలిచారు .ఇంకా చిన్న తిరుపతి  గా  కూడా బాగా ప్రసిద్ది  చెందింది. ఈ చిన్న తిరుపతి లేదా ద్వారకా తిరుమల క్షేత్రం చాలా ప్రత్యేకతలతో నిండి వుంది.ఇక్కడ ఒక   ప్రత్యేకత  ఎమిటంటే స్వామి వారు  దక్షిణాభిముఖం గా వుంటారు ఉండటం అనేది చాలా అరుదు.ఇలా దక్షిణాభిముఖంగా ఎందుకు ఉన్నారంటే  ఎవరి పేరుమీద  అయితే ఈ క్షేత్రం వెలసిందో  ఆ ద్వారక ముని  ఉత్తరాభిముఖం గా తపస్సు చేస్తే  స్వామి ధక్షిణాభిముఖం గా  దర్శనం ఇచ్చారట .ఇంకొక విశేషం  ఏమిటంటే  శ్రీవారివి  రెండు విగ్రహా మూర్తులు  వుంటాయి .ఒక దృవ మూర్తి  సంపూర్ణంగా  వుంటే  ఇంకొక  మూర్తి పై భాగము  అంటే సగ భాగం మాత్రమే కనిపిస్తుంది .ఇవన్నీ కాక ఇంకొక మహత్తరమైన   ప్రత్యేకమైన  విషయం ఒకటి వుంది .పెద్ద తిరుపతి  అంటే తిరుమల తిరుపతి లో  ఏదన్నా మొక్కు కొని అక్కడికి వెళ్లలేకపోతే  ఇక్కడ  వున్న స్వామి ని దర్శించుకొని ఆ మొక్కుబడి ని  ఇక్కడ తీర్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ స్వామి కి మొక్కుకుంటే మాత్రము ఆ  మొక్కుబడి  ని  ఇక్కడే తీర్చుకోవాలి. ఇక్కడ మొక్కుబడి  పెద్ద తిరుపతి  లో  తీర్చుకోవటానికి  లేదు. ఇక్కడ రెండు ధ్రువ మూర్తులు వుండటం వలన స్వామి వారి తిరు కళ్యాణ ఉత్సవాలు ఏడాదికి  రెండు సార్లు  అంటే వైశాఖ మాసం లో  ఒకసారి మరియు ఆశ్వయుజ  మాసం లో ఇంకొకసారి  జరుగుతాయి . ఈ ఉత్సవాలు  చూడటానికి చుట్టప్కల  అంటే ఉభయగోదావరి  మరియి క్రిష్ణా జిల్లా  నుండి చాలా మంది భక్తులు వస్తారు. ఇసుక వేస్తే రాలనంత  జనం వుంటారు.
ద్వారకా  తిరుమల పేరు  వెనుక ఇంకొక  కధ కూడా ప్రచారం  లో వుంది . ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారు, ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని చెపుతారు . తిరుమల ని పెద్ద తిరుపతి గా ద్వారకాని చిన్న తిరుపతి గా  పిలుస్తారు  .
స్థల పురాణం ప్రకారం  ఈ గుడి  దాశరధ  మహారాజు  కాలం నుండి వున్నదని చెపుతారు .ఇక్కడ స్వామి వి రెండు ధృవ మూర్తులు వుంటాయి అని చెప్పుకున్నాము కదా  ఒకటి  అర్ధబాగము ఇంకొకటి పూర్తి విగ్రహము అని . ద్వారక ముని తపస్సు చేసి స్వామి ప్రత్యక్షమైనప్పుడు  శ్రీవారి పాద సేవ కోరుకున్నారట .  శ్రీవారి పాదములు పూజించే భాగ్యం  ద్వారక మునికి  దక్కింది .అందుకని శ్రీ వారి పాద పద్మములు  మాత్రము పుట్ట లో వుంటాయి. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది.. రామానుజాచార్యుల వారు ఇక్కడి కి వేంచేసి  నప్పుడు అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై ప్రతిష్ఠించారని అంటారు .ఇక్కడ ఇంకొక విశేషము వుంది ఏమిటంటే ఇక్కడ స్వామి వారికి  అభిషేకం చెయ్యరు . ఎందుకటే స్వామి వారిని  చీమల పుట్ట నుండి  వెలుపలికి తీశారు మరియు స్వామి వారి పాద పదములు పుట్టలో వుండటం వలన ఒక్క నీతి బొట్టు పడిన  స్వామి వారి విగ్రహం కిందన పుట్టలో వున్న  ఎర్రచీమలకు ఇబ్బంది కలుగుతుంది వాటిని కదలించకూడదు.       
 గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠింపబడిన వేంకటేశ్వరస్వామి కన్నులపండువుగా కనిపిస్తారు ఇక స్వామి వారికి కుడివైపున   వున్న మంటపములో తూర్పు ముఖం గా  అలిమేలు  అమ్మవారు ,అండాళ్ అమ్మవారు కొలువై  మనలినీ దీవిస్తూ వుంటారు . గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలుంటాయి . ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామిగరుడస్వామిల చిన్న మందిరాలు ఆలయము చుట్టూ మనం ప్రదక్షిణ చేసే మార్గం లో  ప్రహరీని ఆనుకొని 12 మంది  ఆళ్వారుల ప్రతిమలతో వున్న చిన్న ఆలయాలు వుంటాయి  . నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో దక్షిణ దిక్కున వున్న గాలి గోపురం  5 అంతస్తులతో మిగిలిన మూడుంటికంటే  పెద్దదిగా  వుంటుంది .ఈ ఆలయ ప్రాంగణం లో ఆళ్వారుల సమక్షం లో ద్యాన సాధన  అలవాటు వున్న వాళ్ళకి చాలా బావుంటుంది.శక్తి ప్రకంకపనలు అనుభవం లోకి వస్తాయి .

తాళ్ళపాక అన్నమయ్య 
ఆలయం  బయట  ఒక పార్క్ ల కట్టారు  ఈ పార్క్ మద్య లో  వాగ్గేయకారుడు  అన్నమాచార్యులవారి పెద్ద విగ్రహం ప్రతిష్టించారు. ద్వారక తిరుమల కి క్షేత్రపాలకులు  శ్రీ భ్రమరాంబ  మల్లేశ్వర స్వామి. ఈ ఆలయం వేంకటేశ్వర స్వామి ఆలయానికి  వెనుక గా అనగా వాయువ్య దిక్కులో  శ్రీ  భ్రమరాంబ  సమేత మల్లేశ్వర స్వామి కొలువు తీరి  ఉన్నారు  . ఈ ఆలయం లో కొండ  మల్లేశ్వర స్వామి తో  పాటు అమ్మవారు   భ్రమరాంబ గా మరియు గణపతి కొలువు తీరి  వున్నారు,
కొండ భ్రమరాంబ  మల్లేశ్వర స్వామి ఆలయం 


శ్రీవారి  గుడి నుండి భ్రమరాంబ  మల్లేశ్వర స్వామి ఆలయం కి వెళ్ళే మార్గం మద్యలో గోశాల మరియు గజ శాల వుంటాయి . మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ , అందువల్ల ఈ గుడిని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు .కొండపైన చుట్టూ పచ్చదనం తో కొత్తగా కట్టిన  శివోద్యానం అనే పూలతోట తో చాలా ఆహ్లాదముగా  చాలా ప్రశాంతముగా వుంటుంది .ఇక్కడ ఏ‌పి‌టి‌డి‌సి వారి పున్నమి వసతి గృహం ఉంటుంది. 
గోశాల 


గజశాల 









భక్తులు శ్రీవారి ఆలయం కి వచ్చే త్రోవలో కుంకుళ్లమ్మ గుడి (రేణుకా దేవి ఆలయం) ఉంటుంది .ఈ అమ్మవారు భక్తులకు  యాత్ర సమయం లో ఎలాంటి కష్ట నష్టాలు కలగకుండా  సదా రక్షిస్తుంటారు .భక్తులు ఈ గుడిలో వెనుక బాగం లో కుంకుడు చెట్టు వుంటుంది . ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పనిసరిగా చాలామంది కుంకుడి చెట్టుకి నమస్కరించి ప్రదక్షిణ చేస్తువుంటారు. ద్వారక తిరుమల క్షేత్రం కి  వచ్చినవాళ్లు  తప్పకుండ  కుంకుళ్లమ్మ  దర్శించుకోవాలి  అని స్టానికులు చెప్పుతారు . ఒకవేళ  భక్తులు కుంకుళ్లమ్మను  దర్శించుకోకపోతే  తప్పకుండ  ఇంకొక సారి  చిన్న తిరుపతి కి రావలిసి వుంటుంది అంటే అమ్మవారు రప్పించుకుంటారని  ఇక్కడి స్టానికులు బలంగా నమ్ముతారు .
కుంకుళ్లమ్మ (రేణుక దేవి) ఆలయం 

ఇంకా కుంకుళ్లమ్మ గుడి తరువాత ఒక 2 కి మీ దూరం లో సంతాన వేణుగోపాల జగన్నాధస్వామి ఆలయం లక్ష్మి పురం అనే గ్రామం  లో వుంది .చాలా పెద్ద ఆవరణ లో  ఉన్న ఈ గుడి చాలా  బావుంటుంది. 130 సంవత్సరాల కి క్రితం అయిన  పూరీ
(ఒడిషా)కి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే వేంకటేశ్వర  స్వామి భక్తురాలు నిర్మించారు .శ్రీవారి ఆలయం తో పాటు వారి ఇలవేల్పు అయిన జగన్నాథ స్వామి వారి తో పాటు సుభద్ర బలదేవుల సన్నిదులు కూడా ఉన్నాయి .ఆవిడ పేరుతోనే ఈ గ్రామం లక్ష్మిపురం అని పిలవబడుతోంది.  ఇక్కడికి  రావటానికి దేవస్థానం ఉచిత బస్ సౌకర్యం వుంది .ఈ గుడి కూడా తప్పకుండ చూసితీరావాల్సిన  ప్రదేశం చాలా బావుంటుంది.
ఇక్కడ వుండటానికి అంటే  శ్రీ  భ్రమరంభా కొండ మల్లేశ్వర  స్వామి  ఆలయానికి  వెళ్ళే త్రోవలో APTDC వారి పున్నమి  గెస్ట్ హౌస్ ఉంది.అంతే కాకుండా దేవస్థానం వారి కాటేజీలు ( ఏ‌సి మరియు నాన్ ఏ‌సి) ఉన్నాయి . ఈ కాటేజీల నిర్వహణ మరియు వసతి సౌకర్యం  చాలా బావుంది .కాటేజ్ అద్దె  కూడా అందరికీ  అందుబాటు ధరల్లోనే వుంది .దేవస్థానం వారు dormitories ఇంకా లాకర్ సౌకర్యం కూడా  ఇస్తున్నారు.కొండ క్రిందన చాలా ప్రైవేట్ వారి వసతి గృహాలు చాలా  ఉంటాయి .దేవస్థానం వారు ద్వారకా తిరుమలనుండి తూర్పు యడవల్లి సీతారామచంద్ర దేవస్థానానికి, లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాధస్వామి ఆలయానికి, కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు నడుపుతున్నారు.
ద్వారక తిరుమల  క్షేత్రానికి   వెళ్ళటానికి  తాడేపల్లి గూడెం,ఏలూరు,భీమడోలు నుండి ఏ‌పి‌ఆర్‌టి‌సి వారి బస్సులు ఉంటాయి . ఏలూరు నుండి ఒక గంట ప్రయాణం . ఏలూరు అన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఆగుతాయి .
తాడేపల్లి గూడెం లో కూడా  ముక్యమైన  అన్నీ ట్రైన్స్ ఆగుతాయి .17 కి మీ  దూరం లో వున్న భీమడోలు లో మాత్రం పాసింజీర్ మాత్రమే ఆగుతుంది .రాత్రి 8 గంటలు తరువాత బస్ లు  తక్కువగా వుంటాయి .
ద్వారకా తిరుమల తప్పక  దర్శించవలసిన  పుణ్యస్థలం . మీరు వెళ్లినప్పుడు మీకు ధ్యానం,సాధన అలవాటు వుంటే  మాత్రం ఆలయ ప్రాంగణం లో ఒక్క అరగంట అయిన సాధన చేయండి.స్వామి వారి శక్తి  ప్రకంపనలు అనుభవంలోకి వస్తాయి . ఈ విషయం  నేను మొదటిసారి  ఈ గుడి కి వెళ్లినప్పుడు ఒక పెద్దావిడ  కులశేఖర అళ్వార్  దగ్గర నేను కూర్చుని వున్నప్పుడు ఆవిడ చెప్పారు.ఇక్కడ స్వామి శక్తి రూపం లో వుంటారు ,  ఆళ్వార్ దగ్గర కానీ ప్రాంగణం లో  ఎక్కడ అన్న కూర్చొని ద్యానం చేయు సాధన కుదురుతుంది  అని చెప్పారు . నేను ఎప్పుడు వెళ్ళిన పెద్దావిడ సూచనని తప్పకుండ పాటిస్తాను .

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః