తెలుగు తొలి వాగ్గేయకారుడు శ్రీకాంత కృష్ణమాచార్యులు
ఆఖరి భాగం
కృష్ణమయ్య
సంకీర్తన యఙ్ఞం జరుగుతుండగానే సింహాచల క్షేత్రానికి ఆదిశేషు అవతారం అయిన భగవద్రామానుజులు
వారు విచ్చేసి , ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటు న్నారు.ఇప్పుడు కొంచెం రామానుజాచార్యుల
సింహచాల క్షేత్ర దర్శన సంగతులు
చెప్పుకుందాము.రామానుజాచార్యుల వారు తప్పస్సు తో పాటు రోజు నేటీ ఆలయ బేడా మండపంలో
ఈశాన్య మూల ప్రవచనాలు చెపుతువుండేవారు. ప్రవచనాలు వినడానికి స్వామి వారు హంస
రూపంలో ప్రతిరోజు వస్తువుండెవారట.
సింహగిరి క్షేత్రానికీ ప్రతిరోజు వస్తూ ఈశాన్య మూల కూర్చోని రామానుజులవారి వచనాలు
వినడంతో ఆ స్థలం "హంసమూల" గా ప్రసిద్ది చెందింది . ఇప్పుడు కూడా ఈ
చోటు ని ఆలయ ఈశాన్య భాగాన రాతిరథం వెనుక
వైపు ఈ హంసమూల అచట శ్వేత వర్ణంలో భగవద్రామానుజుల వారిని వారితో పాటు శ్రీ సింహాచల
దేవస్థానం ఏర్పాటు చేసిన రాతిశాసనాన్ని చూడవచ్చు.చూసారా మన సింహాద్రి అప్పన్న ఎంత భక్త సులభుడో ,ఒకరి కోసం హంస
రూపం లో ఇంకొకరికోసం బాలుని రూపం లో దర్శనం ఇచ్చారు .
ఇప్పుడు మన కధ
లోకి వద్దాము. తన సంగీతానికి ,తన
సంకీర్తనకు అప్పన్న దాసుడు అని భావించిన కృష్ణమయ్యకు గర్వం పెరిగింది అందుకని ఆ క్షేత్రంలో
తపస్సు చేసుకుంటున్న రామానుజాచార్యుల వారిని
కృష్ణమాచార్యులు అంతగా లక్ష్య పెట్టలేదు కనీసం నమస్కారం కూడా చేయలేదు .గర్వం
అనేది అద్యతిమిక పురోగతికి ఆటంకం అందుకని రామానుజులు, తన సహజ కృపా
దృష్టితో ఈ పనికి పూనుకున్నారు. వారు కృష్ణమా చార్యునితో, తాము నృసింహుని
సన్నిధికి వచ్చామని, కృష్ణమాచార్యులు
భగవంతునికి బహు సన్నిహితులు గనుక, తనకు ముక్తి లభిస్తుందో లేదో స్వామిని
విచారించి తనకు తెలియజేయమని కోరారు. అలా ఆ సందేహన్ని యథావిధిగా బాలుని రూపంలో
రాత్రి తన సంకీర్తనకు నర్తించి స్వామి వెళ్తుండగా అడుగుతాడు కృష్ణమయ్య.
ఆ మాటకు స్వామి అందరకీ మోక్షన్నిచ్చేది రామానుజుడైతే ఆయనకీ నేను మోక్షమివ్వడమేంటనీ అడుగుతాడు. ఆ మాటకు ఖిన్నుడైన కృష్ణమయ్య తానిన్నాళ్లూ ఎవరినైతే లక్ష్య పెట్టలేదో అతడే అందరికీ ముక్తినిచ్చేవాడని ఈ స్వామి చెప్పటమా? ఏమిటీ దేవుని న్యాయరీతి? ఒక పక్క గుండెలు రగులు తూంటే స్వామినడిగాడు,పోనీ, నా జీవిత మంతా నీ కైంకర్యానికే వినియోగించాను కదా! మరి నాకైనా నీవు ముక్తినిస్తావా? అని.అప్పుడు స్వామి వారు నీకు కూడ మోక్షమిచ్చేదీ రామానుజుల వారేనని చెపుతాడు. ఆది నుండి రామానుజుల పట్ల చిన్నచూపు చూసిన కృష్ణమయ్యకు ఈ మాట అనిశపాతంలా తగిలింది.దుఖం తో కూడిన కోపం తన్నుకువచ్చింది.తన జీవితమంతా ఎవరి సేవ కొరకు వినియోగించాడో, ఆ సింహాచల నాథుడనవలసిన మాటేనా ఇది అని కోపం తో భగవంతుడు,తను ఆరదించిన దేవదేవుడు అని మర్చిపోయి దూషించటం మొదలుపెట్టాడు.స్వామి వారు కూడా ఎక్కడ తగ్గ కుండ “ ముక్తియంతటి స్థితి నీకివ్వటానికి, నేనేమీ నీకు ఋణపడిలేను. నీవు నీ గానం తో నన్ను పరవశింపజేస్తే, నేను నాట్యంతో నీకు పరమానందం కలిగించాను. కాబట్టి బాకీ చెల్లి పోయింది. అయినా అకారణంగా దైవ దూషణ చేశావు గనుక, ఏ పద వాఙ్మయం చూసుకుని నీవింతగా గర్విస్తున్నావో, అది భావితరాలకు అందకుండా పోతుంది” అని శపించారు. ఈ అఘాతానికి ఆచార్యుల మతి స్థిమితం కూడా పోయింది. ముక్తి సంగతి అలా ఉంచితే, శాపమా తనకు దక్కేది అని ఆచార్యుల వారు కోపం లో స్వామి వారికి “ నీ ఆలయం ఏడు రోజులపాటు అగ్నికి ఆహుతి అవుతుంది” అని ప్రతి శాపమిచ్చారు. భక్తుడు భగవంతుడికి, భగవంతుడు తన భక్తుడికి శాపాలు ఇచ్చుకునే ఇటువంటి ఘటన ఇంకెక్కడా కనిపించదేమో.
ఆ మాటకు స్వామి అందరకీ మోక్షన్నిచ్చేది రామానుజుడైతే ఆయనకీ నేను మోక్షమివ్వడమేంటనీ అడుగుతాడు. ఆ మాటకు ఖిన్నుడైన కృష్ణమయ్య తానిన్నాళ్లూ ఎవరినైతే లక్ష్య పెట్టలేదో అతడే అందరికీ ముక్తినిచ్చేవాడని ఈ స్వామి చెప్పటమా? ఏమిటీ దేవుని న్యాయరీతి? ఒక పక్క గుండెలు రగులు తూంటే స్వామినడిగాడు,పోనీ, నా జీవిత మంతా నీ కైంకర్యానికే వినియోగించాను కదా! మరి నాకైనా నీవు ముక్తినిస్తావా? అని.అప్పుడు స్వామి వారు నీకు కూడ మోక్షమిచ్చేదీ రామానుజుల వారేనని చెపుతాడు. ఆది నుండి రామానుజుల పట్ల చిన్నచూపు చూసిన కృష్ణమయ్యకు ఈ మాట అనిశపాతంలా తగిలింది.దుఖం తో కూడిన కోపం తన్నుకువచ్చింది.తన జీవితమంతా ఎవరి సేవ కొరకు వినియోగించాడో, ఆ సింహాచల నాథుడనవలసిన మాటేనా ఇది అని కోపం తో భగవంతుడు,తను ఆరదించిన దేవదేవుడు అని మర్చిపోయి దూషించటం మొదలుపెట్టాడు.స్వామి వారు కూడా ఎక్కడ తగ్గ కుండ “ ముక్తియంతటి స్థితి నీకివ్వటానికి, నేనేమీ నీకు ఋణపడిలేను. నీవు నీ గానం తో నన్ను పరవశింపజేస్తే, నేను నాట్యంతో నీకు పరమానందం కలిగించాను. కాబట్టి బాకీ చెల్లి పోయింది. అయినా అకారణంగా దైవ దూషణ చేశావు గనుక, ఏ పద వాఙ్మయం చూసుకుని నీవింతగా గర్విస్తున్నావో, అది భావితరాలకు అందకుండా పోతుంది” అని శపించారు. ఈ అఘాతానికి ఆచార్యుల మతి స్థిమితం కూడా పోయింది. ముక్తి సంగతి అలా ఉంచితే, శాపమా తనకు దక్కేది అని ఆచార్యుల వారు కోపం లో స్వామి వారికి “ నీ ఆలయం ఏడు రోజులపాటు అగ్నికి ఆహుతి అవుతుంది” అని ప్రతి శాపమిచ్చారు. భక్తుడు భగవంతుడికి, భగవంతుడు తన భక్తుడికి శాపాలు ఇచ్చుకునే ఇటువంటి ఘటన ఇంకెక్కడా కనిపించదేమో.
4లక్షల 32 వేల సంకీర్తనలు
తెలుగు లో తొలి లిఖిత అక్షరాలు రాగి రేఖుల పై లిఖించిన కృష్ణమయ్య కు తన గర్వం
పూర్తిగా తొలగిపోయింది.మనో నేత్రంలో మహావిష్ణు రూపంలో రామానుజులు వారు కనపడే సరికి
వెళ్ళి శరణు వేడారు కృష్ణమాచార్యులు వారు.భగవంతుడు భక్తుని కి దాసుడేనని ఆయన
భక్తునిగా నీవు నోరు జారిన మాటకు తిరుగుండదని ఆలయ అగ్నికి ఆహుతి అవుతుందని (ఇక్కడ
ఆహుతి అనే పదానికి ధ్వంసం అనే అర్థం తీసుకోవాలి) అదే సమయాన తన శక్తిని స్వామి
నిరూపించుకుంటారని శెలవిచ్చి వెళ్ళారు రామానుజులవారు. కొన్ని వందల
సంవత్సరాల తరువాత కృష్ణమయ్య మాటలు నిజమయ్యాయి. ఈ శాపాల ప్రభావమా
అన్నట్లు, 18వ శతాబ్దంలో
జరిగిన విదేశీ దండయాత్రల్లో ఈ క్షేత్రం విధ్వంసానికి గురికాగా, ఆచార్యుల సంకీర్తన
వాఙ్మయం అంతరించి, నేడు కేవలం రెండు
వందల సంకీర్తనలు మాత్రమే లభ్యమౌతున్నాయి. తననే నమ్మి త్రికరణ శుద్ది
గా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదని స్వామి నిరూపించడానికే తన ఆలయం మీద
దండయాత్ర జరిగిన సహించాడు స్వామి.అదే సమయాన మరో భక్తుని మొర ఆలకించి ఆ
దండయాత్రను తిప్పి కొట్టాడు వరాహనృసింహుడు(ఈ గాధ తరువాతి బ్లాగ్ లో చెప్పుకుందాము).
మన కృష్ణయ్య కాకతీయ
సామ్రాజ్య ప్రభువు ప్రతాపరుద్రుడు సమకాలనీకుడు. భక్తి పారవశ్యం తో కీర్తనలు
చేస్తున్న విషయము అప్పటి కాకతీయ
ప్రభువు ప్రతాపరుద్రుడు కి తెలిసి
కృష్ణమయ్య ను ఓరుగల్లు(ఇప్పటి వరంగల్) కి పిలిపించి కనిగిరి లో
నాలుగవ బాగాన్ని మరియు 50 గ్రామాల పై అధికారాన్ని ధారదత్తం
చేశారు.ఆచార్యులు వారు రచనా వ్యాసంగం ,సంకీర్తన తో పాటు నిరుపేదలకు ధన
సాయమ ,ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేవారు.ఆయన తన చేపట్టిన
రచనలన్నీ రాగి రేకుల పై చెక్కించి శాశ్వతత్వాని కల్పించారు.ఈ పద్దతినే అన్నమయ్య కూడా అనుసరించారు.కొంతమంది అసూయపరులు,దుష్టులు ఆచార్యుల వారు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం
చేస్తున్నారని ప్రతాపరుద్ర చక్రవర్తి కి
పలుమార్లు ఫిర్యాదు చేసిన కృష్ణమయ్య
మనసతత్వం తెలిసిన ప్రతాపరుద్రుడు ఫిర్యాదు
చేసిన వారిని మందలించారు.ఈ సంగతి తెలిసిన ఆచార్యుల వారు సింహాచల వరాహ నరసింహ స్వామి ని స్తుతించి
చేసిన సంకీర్తన వలన ఓరుగల్లు నగరం లో కనక వర్షం కురిసిందని చారిత్రిక ఆధారం ‘సిద్దేశ్వర
చరిత్ర ‘ అనే గ్రంధం ద్వారా తెలుస్తుంది.
పరిపూర్ణ భక్తి
పరిమళంతో, మన అంతరంగమంతా
నిండి పులకింపజేస్తాయి. ఆర్తి, శరణాగతితో నిండి లయ బద్ధంగా, రాగయుక్తంగా ఉండటం
వల్ల, వచన గేయాలుగా
ప్రసిద్ధికెకృష్ణమాచార్యుల వచనాలుక్కాయి. ప్రతి వచనమూ “దేవా“ అనే సంబోధనతో మొదలై, “సింహగిరి వరహరీ!
నమో నమో దయానిధీ” అన్న మకుటంతో ముగుస్తుంది.వీటిలో
వ్యక్తమయ్యే దృఢభావాలు ।సింహగిరి నృసింహుని మించిన దైవం లేదు శ్రీ వైకుంఠం కంటే
మరో ప్రయోజనం లేదు| అని. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ
విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు.అన్నమయ్య మరియు
పోతన గారికి కృష్ణమాచార్యులవారే ప్రేరణ ,స్పూర్తి మన క్రిష్ణమయ్య గారి
వచనాలే.
కృష్ణమయ్య రచన, సంగీతం, నాట్యం, భక్తి గల బహుముఖ
ప్రజ్ఞాశాలి అన్నిటికి మించి అభ్యుదయవాది.ఆయన రచనలను పరిశీలిస్తే ఆయన వైష్ణవ సంప్రదయాన్ని త్రికరణ శుద్దిగా ఆచరించి
చూపిన మహానుభావుడు.శ్రీమద్వరామానుజాచార్యులు సూత్రాలైన ఆచార్య భక్తి,స్వామి
కైంకర్యం,వర్ణాశ్రమధర్మ రాహిత్యం మొదలిన వైష్ణవ
ధర్మాలను తన రచనలలోనే కాదు తన జీవన
విదానంలో కూడా ఆచరించారు.తన చిన్ననాడు
తనని కాపాడిన కువ్వారు స్వామి ని జీవితాంతం స్మరిస్తూనే వున్నారు.
సింహాచలం మరియు
ఇతర కొన్ని వైష్ణవ ఆలయాలలో నేటికీ కొన్ని
ఉత్సవ సమయాలలో “సన్నిధి విన్నపం” ఆనే సంప్రదాయం వుంది.ఆ సంకీర్తన కృష్ణమయ్యదేనని
కొందరి భావన. మన దురదృష్టం కొద్ది ఆయన
రచనలలో 150/200 తంజావూరు గ్రంధాలయం లో తాళ పత్రాలలో దొరికాయి.వైష్ణవం పేరుతో జరిగే కొన్ని
ఛాందస్త భావాలని కృష్ణమయ్య తీవ్రముగా ఖండిచటం వలన ఆయన్ని ఆ రోజులో వెలుగు లోకి రాకుండా చేశారని
కూడా బావించవచ్చు.నాలుగు లక్షలుకు పైగా సంకీర్తనలు చేసిన ఆ మహానుభావుడు మరియు ఆ కీర్తనలు వెలుగులోకి రాకపోవటం మనం చేసుకున్న దురదృష్టం. ఆయన
తరువాత తరం వారైన అన్నమయ్య కు తగినంత
ప్రాచుర్యం లభించిఆయన కీర్తనలు వెలుగు లోకి రావటం
ఈయన వెలుగులోకి రాకపోవటానికి అన్నమయ్య కు వున్నట్టు ఆచార్యుల వారికి ప్రతిభావంతులైన కొడుకులు మరియు మనుమలు లేకపోవటం
కూడా కావొచ్చు.అన్నమయ్య సంకీర్తనలు వెలుగు లోకి రావటానికి టిటిడి చేసిన కృషి కూడా ఒక కారణం.కానీ మన
కృష్ణమ్మయ్య కి ఎవరి అండదండలు అంటే అటు ప్రభుత్వం
కానీ ఇటు దేవస్థానం సహకారం లేకపోవటం వలన కూడ ఆయన కీర్తి,కీర్తనలు
కూడ చీకటిలో మరుగున పడిపోయాయి.
ఆ కీర్తనలు శ్రీ
కూర్మంలో గల పుష్కరణి మధ్యలో ఉన్న స్వామి ఆలయం క్రింద ఉన్న సొరంగం లో ఉన్నాయనీ..
కాదు చావులమదుం(తుమ్మెదల మెట్ట) దగ్గర ఆ తుమ్మెదలు ఒక బిలంలో దూరాయని అదే బిలంలో ఈ
సంకీర్తనలు ఉన్నాయని వివిధ ప్రచారలు ఉన్నాయి. అలానే బ్రిటీషర్లు తరలించుకుపోయిన మన
సంపదలో120 రాగిరేఖుల
సంకీర్తనలు కూడా ఇంగ్లాండు మ్యూజియంలో ఉన్నాయి.
ఆ దేవదేవుడు
సింహాద్రి అప్పన్న నే పూనికొని తన భక్తుడి
సంకీర్తనలన్నీ వెలుగు లోకి ఆ దేవదేవుడే తేవాలని
ప్రార్ధిస్తూ ఉదాహరణ కి కృష్ణమయ్య
వచనాలు కొన్ని
దేవా!
విష్ణుభక్తి లేని విద్వాంసుని
కంటే హరికీర్తనము జేయునతడే కులజుండు .
శ్వపచుండైననేమి?ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటే నతడే కులజుండు.
దేవా!
జయా జయా రాఘావేశ్వరా !శ్రీ మన్నారాయణా
పరబ్రహ్మ స్వరూపా !అఖిలాండ
కోటి బ్రహ్మాండనాయకా
వేదాంత వేద్య,పురాణ పురోషోత్తమా!
పురంధరవంద్య,కపటనాటక
సూత్రధారి
ఆగణిత మహిమావతార
!సకలగుణోన్నత!
శ్రీ కృష్ణ కువ్వారు స్వామీ!
సింహగిరి నరహరి! నమో నమో
దయానిధి.
దేవా!
ఇదియే సత్యము ఇదియే నిత్యము
హరి నామమే పరమపదసోపానము
మనసా నీవు అనుమానముడిగి
నరహరి నామము తలచిన చాలు ||ఇదియే సత్యము||
ఇదియే నాకు జపము తపము
ఇదియే నాకును పరమమంత్రము
ఇదియే నాకును పరమధర్మము
వేదశాస్త్ర పఠనింబిదయే !
సింహగిరి నరహరి! నమో నమో
దయానిధి ||ఇదియే సత్యము||
నేటి
అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే విధంగా రాశాడు. తెలుగు భాషకు
ప్రాచుర్యం కల్పించిన కృష్ణమాచార్యులు మనకు ఆరాధ్యుడు మరియు చిరస్మరణీయుడు.ఆయన కీర్తి
మరియు ఆచార్యుల వారి నాలుగు లక్షల ముప్పైరెండువేల సంకీర్తనలు వెలుగు లోకి రావాలని ఆ సింహాద్రి అప్పన్న ని కోరుకుందాము.
ఓం శ్రీ భగవాన్
రమణాయ నమః
No comments:
Post a Comment