నాన్నగారు అరుణాచలం దర్శించిన క్షణం నుండి
నాన్నగారు తన జీవితాన్ని రమణ
భగవాన్ కి అంకితం చేసుకున్నారు.రమణతత్వాన్ని అందరికీ అర్ధం అయ్యేటట్లు భోదించటమే తన కర్త్యవ్యం గా చేసుకున్నారు.రమణ వాణి ని తన అద్భుతమైన వాక్చాతుర్యంతో రమణ భక్తులకు వినిపించారు. ఒకసారి 1982 లో రమణాశ్రమం లో వున్నప్పుడు భగవాన్, నాన్నగారికి ఆత్మసాక్షాత్కారం ప్రసాదించి ఆశ్వీరదించారు .రమణతత్వాన్ని సామాన్య జనానికి సైతం అర్ధమైన రీతిలో వివరించి చెప్పేవారు.తన ఆఖరి క్షణం వరకు భగవాన్ కి తన జీవితాన్ని అంకితం చేసి రమణ వాణి ని అందరికీ చేరువ చెయ్యటమే తన కర్తవ్యం గా జీవించారు.
నాన్నగారు యెప్పుడు తెల్లని వస్త్రాలలో వుండేవారు. వారు నిరాడంబరం గా, ప్రశాంతముగా పసిపిల్లల అమాయకత్వం తో కూడిన ముఖంతో ఒక వింత అయిన కాంతి తో మెరిసిపోతువుండేవారు. వారి ప్రతి కదలిక లోనూ సహజత్వం,సరళత్వం వుట్టి పడుతుంటాయి.వారు ఎల్లవేళలాఅందరికి అందుబాటులో వుండేవారు.వారి హృదయాంతరాలలో దాగి వున్న సచ్చితానందం వారి మోముపై యెప్పుడు సదా చిరునవ్వు రూపం లో తొణికిసలాడుతువుంటుంది.నాన్నగారి సత్సంగాలకి ఒకోసారి ముప్పై నుండి నలబై వేలలో శ్రోతలు వచ్చి వారి ప్రసంగాన్ని మంత్రముగ్ధులై వినేవారు. అక్షరం ముక్క కూడా తెలియని వారికి కూడా సులువుగా అర్ధమయ్యే విదంగా వివరించి మాట్లాడటం అంటే సామాన్యమైన విషయం కాదు.గురువు అనుగ్రహం వున్నవారికే మాత్రమే అది సాద్యపడుతుంది.
భగవాన్ చూపిన మార్గాన్ని, భోధలని తూ చా తప్పకుండ పాటించేవారు.నాన్నగారికి ఎటువంటి తారతమ్యాలు వుండేవి కావు .ఆయనకి అందరూ ఒక్కటే. పెద గొప్ప, విద్యావంతులు నిరక్షరాస్యులు, ఇలా ఒక వర్గం కాదు ఎవ్వరికైనా, ఎటువంటి వారికైనా నాన్నగారి సమక్షం లో అంతులేని శాంతి లభించేది.నాన్నగారి దగ్గర యెటువంటి సమస్యకైనా, సందేహానికైనా ఊరట, సమాధానం లభిస్తాయి. వచ్చినవారు సత్యాన్వేషకులు కావొచ్చు,బాధలలో వున్న గృహస్తులు కావొచ్చు,కొత్త గా ఆద్యాత్మిక మార్గం లో అడుగులు వేస్తున్న వాళ్ళు కావొచ్చు ఎవ్వరికైనా వారికి కావలిసింది నాన్నగారి సమక్షం లో లభించేది ,అందరిపట్ల ఒకేరకమైనా ఆదరణ చూపించేవారు నాన్నగారు.నాన్నగారు సాధన కి ఎలాంటి ప్రత్యకమైన పద్దతి కానీ ఎలాంటి టెక్నిక్స్ గాని చెప్పేవారు కాదు. ఎల్లప్పుడు తమ సహజస్తితిలో వుండమని చెపేవారు. అంటే రమణ మార్గము అయిన ఆత్మ విచారణ మాత్రమే ఆత్మ సాక్షాత్కారానికి చేరుస్తుందని చెప్పేవారు.
నాన్నగారు జీన్నూరు లో మరియు తిరువణ్ణామలై(అరుణాచలం) లో ఆశ్రమాలు నిర్మించారు. 1980 లో జీన్నూరు లో శ్రీ రమణ క్షేత్రం,1994 లో అరుణాచలం లో నాన్నగారి ఆశ్రమం ను, 1999 లో ఆంధ్రా ఆశ్రమం భక్తుల కోసం నిర్మించారు.ప్రతి సంవత్సరం భక్తులతో కలిసి అరుణాచలం వచ్చి కొన్ని నెలలు రమణాశ్రమం లో గడిపేవారు.
1991 లో రమణ భాస్కర అనే తెలుగు ఆద్యాత్మిక పత్రికని ప్రారంభించారు.నాన్నగారు ప్రసంగాలు ఇస్తున్నపుడు చాలా మండి భక్తులు వ్రాసుకోవటం లేదా రికార్డు చేసుకొని వుంచుకుంటారు.ఆ ప్రసంగాలకి అక్షర రూపమే రమణ భాస్కర పత్రిక. నాన్నగారి ప్రసంగాలు ,అమృత వాక్కులు పుస్తకాలుగా కూడా లభ్యమవుతున్నాయి . ఎవరన్నా నాన్నగారిని ఈ సత్సంగాల వలన మీరు యేమి సాధించారు అంటే శ్రోతులలో ఆశావాహ దృకపధం పెరిగి,వారి సమస్యలను
పరిష్కరించుకునే మనో ధైర్యం కలుగుతుంది.శ్రవణం,మననం కారణముగా సమాజములో శాంతియుత జీవనానికి ఈ సత్సంగాలు బాటలు వేస్తాయి అని చెప్పేవారు.
రమణ
భాస్కర పత్రికను http://www.srinannagaru.com/sn/index.php ద్వారా కూడా చదవవొచ్చు.రమణ భాస్కర పత్రిక కి ఇంగ్లిష్ అనువాదం కూడా పైన చెప్పిన సైట్ లో దొరుకుతుంది. ఈ సైట్ నుండి నాన్నగారి పుస్తకాలూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు
వి.వి,గణేశన్ గారు(చిన్న స్వామి మనుమలు మరియు రమణాఆశ్రమం కి ప్రెసిడెంట్ గా పనిచేశారు) వ్రాసిన పుస్తకం ”మీటింగ్స్ విత్ సెజస్ అండ్ సెయింట్స్ “ లో నాన్నగారి గురించి వ్రాసారు మరియు నాన్నగారి తో తనకి వున్న అనుబంధం గురించి తన జిన్నూరు పర్యటన గురించి చాలా చక్కగా వివరముగా వ్రాశారు.
వేల్పూరు మౌనస్వామి,వి.గణేశన్ గారు ,నాన్నగారు (ఎడమ నుండి కుడికి) |
మొత్తం తన జీవితాన్ని రమణుల భోదనలను ఆచరించి వాటిని లోకానికి చాటి చెప్పిన నాన్నగారు, భగవాన్ తనకి అప్పచెప్పిన పనులన్ని సక్రమముగా
నిర్వర్తించి 29-12-2017 రమణైక్యం చెందారు.నాన్నగారు బౌతీకంగా మన మద్య లేకపోయిన వారి ప్రసంగాల రూపం లో ఏప్పటికి చిరంజీవులే.భగవాన్ ని బౌతికముగా దర్శించక పోయినా భగవాన్ రమణుల కి తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన రమణ పుత్రుడు జీన్నూరు నాన్నగారు.
ఎవరైనా సాధకులు అధ్యాత్మిక సాధన్ కోసం
అరుణాచలం లో వున్న నాన్నగారి
ఆశ్రమంలో వుండాలి అనుకుంటే, ముందుగా
మెయిల్ గాని ఫోన్ ద్వారా గాని బుక్ చేసుకోవలసి వుంటుంది.. ఆంధ్ర ఆశ్రమం రమణాశ్రమం కి చాలా దగ్గరగా అంటే నడుచుకునే వెళ్లగలిగేంత దగ్గరగా వుంటుంది.భక్తులు వుండడానికి వసతి సౌకర్యం కూడా ఉంటుంది. వసతి కోసం ముందుగా బుక్ చేసుకోవలసి వుంటుంది.
శ్రీ నాన్నగారు గురించి, వారి ప్రసంగాలు, వారి అమృతవాక్కులకు అక్ష్ర రూపం,వారి పుస్తకాలు మరియు ఆశ్రమ విశేశాలు అన్నీ నాన్నగారి సైట్ http://www.srinannagaru.com లో లభ్యమవుతాయి.అరుణాచలం లో వసతి కావాలనుకున్న వారు ఈ సైట్ నుండి ముందుగా బుక్ చేసుకోవచ్చు.
జిన్నూరు ఆశ్రమం లో శ్రీ రమణ జయంతి,దీపోత్సవం,గురుపూర్ణిమ ,నాన్నగారి జయంతి మొదలైన ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు.శ్రీ నాన్నగారు గురించి, వారి ప్రసంగాలు, వారి అమృతవాక్కులకు అక్ష్ర రూపం,వారి పుస్తకాలు మరియు ఆశ్రమ విశేశాలు అన్నీ నాన్నగారి సైట్ http://www.srinannagaru.com లో లభ్యమవుతాయి.అరుణాచలం లో వసతి కావాలనుకున్న వారు ఈ సైట్ నుండి ముందుగా బుక్ చేసుకోవచ్చు.
ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః.
No comments:
Post a Comment