గొలగమూడి నెల్లూరు జిల్లా లో నెల్లూరు నుండి సుమారుగా 12km దూరంలో
వుంది.స్వామి వారు 24-August-1982 లో ఇక్కడే మహా సమాధి
చెందారు.ఇప్పటికి స్వామి పిలిచినవారికి పలికే దైవం ,కొలిచిన
వారికి కొంగు బంగారం.
వెంకయ్య స్వామి
ఆలయం చుట్టూ విశాలమైన ప్రకారం వుంటుంది.ఆలయ ముఖద్వారం నుండి చూస్తే గర్భగుడి లోని స్వామి విగ్రహం స్పష్టం గా కనిపిస్తుంది.భక్తులు సమాధి వున్న
ద్వారం దగ్గరి నుండి కూడా దర్శించుకోవచ్చు.ముఖద్వారం నకు ఎడమ పక్కన ధుని వుంటుంది.భక్తులు ధుని లో ఎండు
కొబ్బరికాయలు,నవధాన్యాలు మూడు లేదా తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి వేస్తారు.స్వామి కూడా ఎప్పుడు ఎక్కడ కి వెళ్ళిన పక్కన ధుని ని
వెలిగించి ఎప్పుడు వెలుగుతూ వుండేటట్టు చూసేవారు.ఆ తరువాత క్యూ లో వెళ్ళి స్వామి
ని దర్శించు కోవాలి.ఆలయం లో స్వామి వారి ఫోటో లు
వుంటాయి.గర్భగుడి లో గోడలకి స్వామి వారి ఫోటో లు రెండు వుంటాయి.గర్భగుడి
లో జ్యోతి వెలుగుతూ వుంటుంది.అక్కడ వెండి
పాదుకలు వుంటాయి.భక్తులు స్వామి వారి పాదుకలను తాకి నమస్కరించుకొని వెంకయ్య స్వామి వారి ని దర్శించుకుంటారు.ఇక్కడ
ప్రసాదం గా తీర్ధం,ఇంకా దారం ,పటిక ,విభూది ఇస్తారు.గుడి ఆవరణ లో స్వామి వారి సూక్తులు వ్రాసి వుంటాయి.
స్వామి సమాధి - గర్భగుడి |
కొందరు భక్తులు స్వామి దర్శనం తరువాత కోరికలు విన్నవించుకొని ఆ రాత్రి ఆ ఆలయ సమీపము లో నిద్రిస్తారు.గుడి
ప్రాగాణం లో ముఖ్య ద్వారం ముందు ఒక పెద్ద
హాల్ వంటిది కట్టించారు.అక్కడ స్వామి వారి ఫోటో వుంటుంది.అక్కడ సాయంత్రం భక్తులు భజనలు
చేస్తారు.ఈ మంటపము లో రాత్రి నిదురించవచ్చు.మరిసటి రోజు స్వామి ని
దర్శించుకొని తిరుగు ముఖం పడతారు.కోరికలు తీరిన
వారు కూడా రాత్రి
నిదురిస్తారు.ఇక్కడ శనివారం విశేష పూజలు జరుగుతాయి.భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.స్వామి
వారి ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా వుంటుంది.స్వామి వారి ఆలయమో కి దగ్గరలో
స్వామి వారి కుటీరం కూడా వుంటుంది.
ప్రతి సంవత్సరం ఆగస్టు
మాసం లో 18-24 తేదీలలో ఆరాధనోత్సవాలు జరుగుతాయి.స్వామి వారి ఆలయము లో నిత్య ఆన్నదానం
కూడా వుంటుంది,స్వామి వారు
ఉన్నప్పుడు లానే .దేవస్తానం వారు ఈ పరంపర ని ఇప్పటికీ స్వామి దయతో కొనసాగిస్తున్నారు.
Nice information
ReplyDelete