Friday, October 19, 2018

యాత్ర 03 -శ్రీకాకుళం-శ్రీముఖలింగం



శ్రీముఖ లింగం

శ్రీముఖలింగం లేదా ముఖలింగం శ్రీకాకుళం జిల్లాజలుమూరు మండలానికి చెందిన గ్రామము. శ్రీకాకుళం పట్టణం నుండి సుమారుగా  45 KM దూరంలో వుంది.ఇక్కడ అనగా శ్రీ ముఖలింగం లో అతి పురాతనమైన మూడు శివాలయాలు వున్నాయి.ఈ ఆలయాల్లో స్వామి ముఖలింగేశ్వరాస్వామి,భీమేశ్వర స్వామి మరియు సోమేశ్వర స్వామి పేరు తో కొలవబడుతున్నారు.ఇక్కడ లభించిన ఆధారాలు మరియు శాసనాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు అద్భుతమైన ప్రాభవం తో విలసిల్లేదని తెలుస్తోంది.శ్రీముఖలింగం గంగ రాజుల కాలం లో రాజధాని గా వుండేడదని ,రాజధాని ని ఇక్కడ నుండి కటక్ కి మార్చిన తరువాత ఇక్కడ ప్రాభవం తగ్గి వుండవొచ్చు అని చరిత్రకారుల అంచనా.ఇక్కడ దొరికిన ఆధారాలను బట్టి హిందు మతం తో పాటు బౌద్ధ ,జైన మతాలు కూడా  వర్ధిల్లాయని తెలుస్తోంది.ఇక్కడ దొరికిన శాసనాలను బట్టి ఈ గ్రామం నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం పేరు తో వుండేదని తెలుస్తోంది.కాల క్రమేణా ముఖలింగేశ్వరాస్వామి  వుండటం వలన శ్రీ ముఖలింగం గా మారి వుండవచ్చు.శ్రీ ముఖలింగం లో మూడు చోట్ల  త్రికోణాకరం లో మూడు ఆలయాలు ఉన్నాయి.ఈ మూడు ఆలయాలు అతి పురాతన మరియు కళింగ నిర్మాణ శైలి లో నిర్మించ పడిన ఆలయాలు.వీటిలో శ్రీ ముఖలింగేశ్వరాలయం ముఖ్యమైంది.
కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీ ముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీ ముఖలింగేశ్వర ఆలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు.ఇక్కడ లింగం రాతి లింగం కాదు.ఇప్ప చెట్టు మొదలు తో ఎర్పిడిన లింగం.అ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుందని చెపుతారు.అందుకనేమో స్వామి కి ముఖలింగేశ్వర  స్వామి గా పిలుస్తారు.ఇప్ప చెట్టుని సంస్కృతం లో మధుకం అంటారు.అందువలన ఈ గుడికి మధుకేశ్వరాలయం గా మధుకేశ్వరాలయం గా  పిలుస్తున్నారేమో.ఇక్కడ అమ్మవారు  సప్త మాతృకలలో ఒకరైన వారాహి దేవి.గర్భాలయం లో లింగం కాక చుట్టూ ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలు వున్నాయి.వారాహి అమ్మవారు కాకుండా ఇంకా  బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి .ఇక్కడ వున్న శిల్పాలలో మనకు వరాహ ,వామనవతార  మరియు సూర్యుని విగ్రహాలు కనిపిస్తాయి.
స్థల పూరణం ప్రకారం శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆవిర్భావానికి  సంబదించిన కధ ఒకటి ప్రచారం లో వుంది.పూర్వం ఒకప్పుడు హిమాలయల మీద  గొప్ప వైష్ణవ యాగం జరిగింది.ఆ యాగాన్ని చూడటానికి  గంధర్వ రాజైన చిత్ర గుప్తుడు తన పరివారం తో వచ్చాడు.అక్కడికి వచ్చిన శబరి కాంతలను చూసి కామవశీభూతులైనయారు.అది గమనించిన వామదేవ మహర్షి  సభా మర్యాద తప్పినందుకు శబరి జాతి లో  పుట్టమని శపించారు.
అలా శాపవశాత్తు గంధర్వులు అంతా శబరులుగా జన్మించారు.వారి నాయకుడు అయిన చిత్ర గుప్తుడు శబరి రాజు గా జన్మించాడు.ఇతనికి చిత్త,చిత్కళ అని ఇద్దరు భార్యలు.రెండవ భార్య అయిన చిత్కళ శివ భక్తురాలు.ఈ రాణులిద్దరికి ఒక్క క్షణం పడేది కాదు.ఒకరోజు చిత్తి శబరి రాజుతో వుంటే నేనైనా వుండాలి లేదా  రెండవ భార్య చిత్కళ అయిన వుండాలి అని నిలదీసింది.శబరి రాజు పట్టపురాణి ని వదులుకోలేక రెండవ భార్యని పిలిచి ఇంటి వాకిలి లో వున్న ఇప్ప చెట్టు రెండుకొమ్మల వంచి,రాలిన పువ్వులు ఏరుకొని అమ్ముకొని  బ్రతకమని చెప్పాడు.భర్త మాటకు ఎదురు చెప్పలేక,ఇప్పచెట్టు కొమ్మలను వంచి పువ్వులు ఎరుకునేది.అయితే చిత్కళ శివ భక్తురాలు కావటం వలనా అవి బంగారు పూలుగా మారిపోయేవి. చిత్కళ ఆ పువ్వులను అమ్ముకుంటూ కాలం గడిపేది.ఈ విషయం తెలిసిన చిత్తి అసూయ తో గొడవకు దిగింది.విసుగు చెందిన శబరి రాజు అన్నింటికి ఆ ఇప్పచెట్టే కారణం అని తలచి చెట్టు మొదలని  నరికి వేశాడు.అప్పుడు శివుడు రౌద్రకారంతో ప్రత్యక్షమయ్యాడు.అధి చూసి ఆ శబర రాజు మూర్ఛపోయాడు.దీనినంతటికి చిత్కళ కారణమని తలచి శబరులందరు చిత్కళను  చంపటానికి సిద్ధపడగా మహా శివుడు ప్రత్యక్షమై వారందరికి  శాప విముక్తి అనుగ్రహించాడు.వారందరూ తమలోకానికి వెళ్లిపోతారు.ఈ విధముగా మహాశివుడు ఇప్పచెట్టులో ప్రత్యక్షమై మధుకేశ్వరుడు గా ముఖలింగేశ్వరుడుగా వెలసాడని స్థల పురాణం చెపుతోంది.ఇప్పచెట్టు మొదలే క్రమంగా  లింగం గా మారి ఆ మొదలు పై ముఖం కనిపిస్తుంది.ఈ లింగం తరువాత రాయి గా గట్టిపడింది అని చెపుతారు.

శ్రీ ముఖలింగేశ్వరుని గుడి  తూర్పు ముఖంగా వుంటుంది.దీనికి ఎదురుగా ద్వాజస్తంభం వుంటుంది.గర్భగుడి ఎత్తైన ప్రాకారం తో రెండు ద్వారాలతో వుంటుంది.ఒకటి తూర్పు ద్వారం మరియు రెండోది దక్షిణ ద్వారం.తూర్పు ద్వారం  పైకప్పు గోపురాకారం లో  కళింగ నిర్మాణ శైలి లో ఉంటుంది.తూర్పు ద్వారం గుండా వెళితే నందీశ్వరుడు వున్న నంది మండపం ఉంటుంది.
శ్రీముఖలింగేశ్వరస్వామి 
గర్భ గుడి లో మెరుగు పెట్టని లింగం తొడుగు తో ఉంటుంది.మూల విరాట్టు ను నిశితం గా  గమనిస్తే లింగం పై నాసిక కనిపిస్తుంది.గర్భగుడి పైకప్పు సమతలం గా ఉండి ఆరు స్తంభాలను ఆధారంగా నిర్మించారు.గర్భ గుడి లో  మూలవిరాట్టు గావున్న లింగం వెనుక భాగం లో ఒక పెద్ద మట్టి గొళెమ్(పాత్ర) ఉంటుంది..ఈ రాతి గోలెం గురించి ఒక కధ ప్రచారంలో ఉంది.నాగన్న అనే  కుమ్మరి భక్తుడు మగ సంతానం కోసం స్వామి వారిని   వేడుకొన్నాడట.మగ సంతానం కలిగితే  ఒక పెద్ద మట్టి గోళమ్ లో ఆవు పాలతో అభిశేకిస్తానని మొక్కుకున్నాడు.నాగన్న కి ఒక మగ శిశువు జన్మించాడు.నాగన్న సంతోషం తో పక్కనే వున్న నది మట్టితో ఒక పెద్ద మట్టి గోలెం తయారీ చేసి  గుడి వద్దకు తీసుకు వచ్చాడు.కానీ ఆలయ ద్వారం గోలెం కంటే చిన్నది అవ్వటం వలన గోలెం లోపలకి వెళ్లలేదు.నాగన్న చాలా నిరాశతో ఆ మట్టి గోలెం ను అక్కడే వదిలి వెళ్లిపోయాడు.కానీ ఆ తరువాతి రోజు ఉదయం గుడి తలుపులు తెరువగానే  ఆ గోలెం గర్భగుడి లో మూలవిరాట్టు వెనుకకు అమర్చి వుంది.ఇప్పటి కూడా  భక్తులు తమ కోరికలు విన్నవించుకొని మొక్కుకుంటారు.తమ కోరిక తీరగానే ఆ గోలెం ను బియ్యం తో నింపుతారు.
ఇంకా రెండవది సోమేశ్వరాలయం .ఈ ఆలయం గ్రామం లో ప్రవేశించగానే కనిపిస్తుంది.ఈ ఆలయానికి ముఖ మండపం ఉండదు.గర్భగుడి మాత్రమే ఉంటుంది.చాలా ఎత్తుగా వుండే ఈ ఆలయ శిఖరానికి  బ్రహ్మాండమైన ఒకే ఒక రాయి తో పైకప్పు వేశారు.ఒకసారి పిడుగు పడి పైకప్పుగా వున్న రాయి పగిలి ఒక ముక్క క్రింద పడింది.ఆ ముక్కని దాదాపు 50 మండి కదల్చలేకపోయారు.ఈ ఆలయం లో యేడు నాలుకల అగ్ని దేవుడి విగ్రహం ,వినాయకుడు,కాశీ అన్నపూర్ణ,నటరాజు,హరి హర దేవుళ్ళ విగ్రహాలు ఎంతో అందముగా నిర్మించారు.అరుణాచలం లో వున్న శిల్ప కళ పోలికతో వున్న విధముగా పార్వతి పరమేశ్వర శిల్పాలు ఉంటాయి. శివపార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తర ముఖంగా వుంటారు.ఈ విదముగా అరుణాచలం లో మరియు శ్రీముఖలింగం లో మాత్రమే కనిపిస్తుంది.ఇంకొక విశేషం గర్భగుడి లో ఒక చోట నుండి చూస్తే మనకు గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కనిపిస్తారు.అందుకు ఈ ఆలయాన్ని పంచయతన క్షేత్రమని అంటారు.గర్భగుడి  ద్వారం నాకు పడమర వైపున గంగ,యమునా మరియు ద్వారపాలకుల శిల్పాలు చెక్కబడి వునతాయి.ద్వారబంధానికి పైన నవగ్రహములు,గజలక్ష్మి శిల్పాలు అభూముఖం గా ఉంటాయి.ఈ ఆలయము లో మరొక ప్రత్యేకత యేమిటంటే లకుశీలుని ని విగ్ర్హము చతుర్భుజుడుగా చెక్కబడి ఉంది. లకుశీలుడు శివుని అవతారమనియు పాశుపత శైవమతస్థులు  నమ్ముతారు.   
సోమేశ్వరస్వామి  గుడి 


దక్షిణామూర్తి 
వినాయకుడు 








ఇక మూడో శివాలయం శ్రీ అనియంక భీమేశ్వరాలయం దీన్నే భీమేశ్వరాలయం అంటారు.ఈ ఆలయాన్ని అనియాంక భీమ వజ్రహస్తుడు కట్టించాడు.ఈ గుడి ముఖలింగేశ్వరాలయం కి దగగ్రలోనే వుంటుంది.ఈ ఆలయం కూడా అద్భుతమైన నిర్మాణం తో అద్భుతమైన శిల్పాలతో చెక్కబడి వుంటుంది.ఈ ఆలయ లో కుమార స్వామి,దక్షిణ మూర్తి,బ్రహ్మ అమృయు గంపతి విగహాలు వున్నాయి.ఈ ఆలయం ఇప్పుడు శిధిలవస్తాలో వుంది.
చరిత్ర పరం చూసిన  శ్రీ ముఖలింగం  కి చాలా చరిత్ర వుంది.ఇక్కడ ఆలయాలు  క్రీస్తు శకం 6,7,8 శతాబ్ధాలలో నిర్మించినట్టు తెలుస్తోంది.ఇక్కడ పురావస్తు తవ్వకాలలో వీణా ధారి అయిన సర్స్వతి విగ్రహం,మహావీరుని విగ్రహం లభించాయి.ఈ మద్యన ఒక ఇంటి నిర్మాణం కోసం పునాదుల తవ్వకాలలో స్వప్నేశ్వర లింగం బయట పడింది.దీన్ని బట్టి కొన్ని శతాబ్ధాల క్రితం స్వప్నేశ్వరాలయం వుండేదని తెలుస్తుంది.ఇక్కడ చరిత్రకు సంబదించిన అనేక శాసనాలు బయటపడ్డాయి.

శ్రీముఖలింగేశ్వరాలయం 
శిల్ప కళ 












మహాశివరాత్రి పర్వదినాన శ్రీ ముఖలింగేశ్వరునికి పూజలు ఘనంగా చేస్తారు. ఆ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను 9 రోజులపాటు వైభవోపేతంగా నిర్వహిస్తారు. సుదూర గ్రామాలు, పక్కనున్న ఒరిస్సా రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు శివరాత్రి ముందురోజే శ్రీముఖలింగం చేరుకొని తొమ్మిది రోజులూ దేవుని దర్శించుకుని తిరునాళ్ళలో పాల్గొంటారు. మహాశివరాత్రి పర్వదినముతోపాటు ప్రతి ఏటా కార్తీక మాసం నాలుగు సోమవారాలు, మిగతా పవిత్ర దినాల్లో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేపడతారు.ఆలయం ఉదయం 5 AM నుండి రాత్రి 8PM వరకు తెరిచివుంటుంది.ఇక్కడికి చేరుకోవటానికి శ్రీకాకుళం  నుండి ప్రతి అరగంటకి బస్సులు కలవు.
శ్రీముఖలింగం లో ఆలయాల సందర్శన ఒక అద్భుతమైన అనుభూతి ని కలిగిస్తుంది.మనలని ఏడు,ఎనిమిది శతాబ్ధాలలోకి తీసుకు వెళుతుంది.
 ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 

1 comment: