Thursday, October 18, 2018

యాత్ర 02-శ్రీకాకుళం-శ్రీకూర్మo


శ్రీ కూర్మం


శ్రీకూర్మం  అరసవల్లి నుండి సుమారుగా  8 కి మీ దూరం  లో  శ్రీకాకుళం పట్టణం నుండి 13 కి మీ దూరం లో వుంది.శ్రీకూర్మం లో శ్రీ కూర్మనాధ ఆలయం వంశధార నది ఒడ్డున వుంది.ఇక్కడ విష్ణు మూర్తి కూర్మావతారంలో  కొలువైవున్నారు.విష్ణుమూర్తి కూర్మావతారం లో పూజలు అందుకుంటున్న ఒకే ఒక ఆలయం శ్రీ కూర్మనాధ ఆలయం.ఈ ఆలయం  లో ఇంకొక ప్రత్యేకత యేమిటంటే విష్ణుమూర్తి  విగ్రహం తాబేలు రూపం లో ఉంటుంది.ఇక్కడ స్వామి  కూర్మనాధుడగా ,అమ్మవారు  కూర్మనాయకి గా కొలువైవున్నారు.ఈ ఆలయాన్ని క్రీస్తు  పూర్వం  రెండవ శతాబ్ధం లో కట్టినట్టు  చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణం చాలా విశిష్టం గా వుంటుంది.ఇక్కడ స్వామి వారు  పడమటి ముఖం గా ఉంటారు.ఇంకొక విశేశం యేమిటంటే ఈ గుడి లో రెండు ద్వజస్తంభాలు వుంటాయి.మరియొక్క విశేషం యేమిటంటే గుడిలో 108 వరకు అరుదైన కుడ్య చిత్రాలతో కూడి వున్న రాతి స్తంభాలు వున్నాయి.కానీ అవి ఒకదానితో ఒకటి పోలిక ఉండదు.

గర్భగుడి లో మూలవిరాట్టు 



కూర్మక్షేత్రానికి, వంశధారానది పుట్టుకకూ పురాణాలలో ఒక కధ ప్రచారం లో వుంది. కృతయుగంలో శ్వేతుడు అనే చక్రవర్తి ఈ భూమిని పాలిస్తూండేవాడు. ఆయన భార్య మహాపతివ్రత,గొప్ప విష్ణుభక్తురాలు.మహారాణి ఎప్పటిలానే ఏకాదశ వ్రత దీక్ష లో వుంది.మహారాణి ఏకాదశ వ్రత దీక్ష లో వుండగా మహారాజు కి  తన భార్య పై అనురక్తి కలిగింది.రాజూ గారు ఏకాంత సేవ కు వస్తునట్టు రాణి కి కబురు పంపారు.మహారాణి యేమి చెయ్యాలో అర్థం కాలేదు.భర్తని కాదు అంటే పాతివ్రత ధర్మానికి భంగం కలుగుతుంది.అవును అనటానికి ఆ రోజు ఆమె ఏకాదశ వ్రతం లో వుంది.అప్పుడు భక్త వత్సులుడు అయిన ఆ శ్రీహరి  ని ధ్యానించింది.వెంటనే భవన సమీపంలోనున్న వెదురుపొదల నుండి ఓ మహాజలప్రవాహం పుట్టుకు వచ్చి, మహారాజ భవనానికి, మహారాణి అంతఃపురానికి మధ్య అడ్డుగా ప్రవహించింది. ఈ విశయం తెలిసి రాజు తన భార్య వ్రతనిష్ఠకు, హరిభక్తికి సంతసించి, తానుకూడా ఈశ్వరానుగ్రహం సంపాదించాలనే సంకల్పంతో చక్రతీర్థంలో తపస్సు రంభించాడు.రాజు భక్తి కి ఆ విష్ణు మూర్తి సంతసించి కూర్మ రూపం లో  అనుగ్రహించారు.స్వామి వారు అక్కడ వున్న శ్వేత పర్వతం మీద కొలువు తీరాలని నారద మహర్షి ని మరియు శ్వేత మహారాజు తో కలిసి పర్వతం ఎక్కటం ప్రారంబించారు.కానీ శ్వేత మహారాజు  పర్వతం ఎక్కలేకపోవటం  గ్రహించి ఆ పర్వతాన్ని భూమికి సమతలం చేశారు.అక్కడ స్వామి వారు తన చక్రం తో ఒక జలకుండాన్ని ఏర్పరిచారు. దీన్నే శ్వేత పుష్కరిణి ,సుధకుండం మరియు చక్రకుండం అని అంటారు.ఇప్పుడు అక్కడ వున్న పెద్ద తటాకం ఈ పుష్కరిణే.ఈ పుష్కరిణి నుండి మహా లక్ష్మి అమ్మవారు ఉద్భవించి స్వామి వారిని చేరారు అని అంటారు.మహారాణి పాతివ్రత్య నియమం కాపాడటం కోసం ఉదభవించిన జలప్రవాహమే వంశధార నది’.

స్వామి పడమటి ముఖంగా ఉండటానికి కూడా ఒక కధ ప్రాచుర్యం లో వుంది.అక్కడికి దగ్గరలో వున్న  అరణ్యాలను పాలించే భిల్లరాజు భక్తికి సంతోషించిన స్వామి అతనికి పశ్చిమాభిముఖం గా దర్శనమిచ్చారని ఆ భిల్లరాజే పుష్కరిణి మెట్లు కట్టించాడని ఒక కధ ప్రాచుర్యం లో ఉంది.కూర్మావతారం లో స్వామి  అమృతోద్భవానికి  కారణమవటం వలన స్వామి వారి ప్రసాదాన్ని అమృతం గా మరియు సర్వరోగనివారిణి గా భావిస్తారు.స్వామి వారి ఆలయంలో  గోవిందరాజస్వామి, చక్రనారాయణస్వామి, బలినారాయణస్వామి, నరనారాయణస్వామి దేవాలయాలు కూడా ఉంటాయి.వీటిని రామానుజాచార్యులు ప్రతిష్టించారని చెపుతారు.వైశ్ణువులు పుష్కరిణి ఒడ్డున వున్న మట్టిని తిరునామం గా ధరిస్తారు.

శ్రీకూర్మంఆలయానికి కర్పూరేశ్వరుడు ,హటకేశ్వరుడు ,కోటీశ్వరుడు ,సుందరేశ్వరుడు మరియు సిద్దేశ్వరుడు క్షేత్ర పాలకులగా ఉన్నారు.ఆలయ ముఖ ద్వారమున భైరవ స్వామి మరియు అష్టదిక్పాలకులు క్షేత్రపాలకులగా స్వామి కొలుస్తున్నారు.ఇక్కడ తాబేళ్ల పార్క్ కూడా ఉంది.భక్తులు  తాబేళ్ల కి గొంగూర వేస్తుంటారు . ఇక్కడ నుండి కాశీ కి వెళ్ళటానికి సొరంగ మార్గం ఉంది.కానీ ప్రస్తుతం మూసివేశారు.ఇక్కడ 11 వ శతాబ్ధం కాలం నాటి శాసనాలు చూడవచ్చు. ఆలయం  చుట్టూ విశాలంగా,చెట్లు  మరియు కోనేరు తో చాలా ఆహ్లాదంగా  ఉంటుంది. 

ఆలయ ముఖద్వారం నుండి గుడి లోపలికి వెళుతుంటే  కుడి వైపున మనకి ఆలయ చరిత్ర  వ్రాసిన  పలక  ఉంటుంది. అది దాటి ఆలా కోచెమ్ ముందుకి వెళితే పెద్ద మర్రి చెట్లు ,పురాతన మండపం  దానికి ఎదురుగ పుష్కరిణి  కనిపిస్తాయి. పుష్కరిణి ఒడ్డున చిన్న గోపురంతో వున్న ఆలయాలు ఉంటాయి.ఆలా ముందుకి వెళితే తాబేళ్ల పార్కు కనిపిస్తుంది.దాటి వీలయితే మనకి గర్భగుడి వస్తుంది.చారిత్రక స్థలాలు చూసే ఆసక్తి వున్నవాళ్లు తప్పకుండా చూడవలసిన  ప్రదేశం శ్రీకూర్మం. 

పాతా సిద్దేశ్వరాలయం - శ్రీ కూర్మం

శ్రీకూర్మం లో చూడవలిసిన  ఇంకొక గుడి పాతాళ సిద్దేశ్వరాలయం.ఇక్కడ శివుడు నెల మాగళి లో వుంటారు.అందుకు ఈ ఆలయాన్ని పాతా సిద్దేశ్వరాలయం అంటారు.ఈ ఆలయం కూర్మలయం కి పక్కనే వుంటుంది.



శ్రీకూర్మంకి చేరుకోవటానికి శ్రీకాకుళం నుండి అరసవిల్లి మీదుగా శ్రీకూర్మంకి బస్సులు కలవు.అరసవిల్లీ నుండి నుమారుగా  10 కే‌ఎం దూరం లో వుంది అరసవిల్లి నుండి పది నిమిషలలో చేరుకోవచ్చు.ఆలయం వుందయం 6 am నుండి రాత్రి 8 am వరకు తెరిచే వుంటుంది.


ఓం శ్రీ భగవాన్ రమణాయ  నమః 

1 comment: